/rtv/media/media_files/2025/02/20/6w8EfYJBl3ZOtfOCGuSx.jpg)
బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్ ఫౌల్ట్రీ పరిశ్రమపై గట్టిగానే పడింది. కోళ్ల మృత్యువాత పడుతున్నాయి. దీంతో జనాలు భయపడిపోయి చికెన్, గుడ్లు తినేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రోజుకు రూ.15కోట్లకు చొప్పున నెలలో రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. దీంతో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డారు. పౌల్ట్రీ రైతులు దాణా ఖర్చులు బాగా తగ్గించుకుంటున్నారు. దీంతో మొక్కజొన్న, సోయాబీన్ అమ్మకాలు, ధరలూ తగ్గాయి. జనవరి మొదటి వారంలో కిలో రూ.28ల వరకు ఉన్న మొక్కజొన్న ఇపుడు రూ. 23కు, కిలో రూ.40లకుపైనే పలికిన సోయాబీన్ రూ.27కు పడిపోయింది. అయితే ఉడికించిన చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేదని వెటర్నరీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అత వేడిలో వైరస్ బతకదని అంటున్నారు.
Also Read : భూపాలపల్లి హత్య ఘటనపై సీఎం రేవంత్ సీరియస్.. సంచలన నిర్ణయం!
5,540 పైగా కోళ్లు మృత్యువాత
ఇక 5,540 పైగా కోళ్లు మృత్యువాత పడిన ఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివకేశవరెడ్డి అనే రైతు తన వ్యవసాయ పొలంలో ఓ షెడ్డును ఏర్పాటు చేసుకుని కోళ్లను పెంచుతున్నారు. అయితే గడిచిన రెండు రోజుల్లో సుమారుగా 5 వేల540 కోళ్లు చనిపోయాయి. మృతి చెందిన కోళ్లను గుంత తవ్వి పూడ్చేశారు. సమాచారం అందుకున్న జిల్లా వెటర్నరీ డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, మండల అధికారి విజయ్ వెళ్లి కోళ్లను పరిశీలించి వాటిని ల్యాబ్ కు పంపించారు.
Also Read : పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
అయితే చనిపోయిన కోళ్లల్లో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడం లేదన్నారు. కొక్కెర రోగం సోకినట్టు అనుమానిస్తున్నట్టుగా వెల్లడించారు. ఐదు కోళ్లను హైదరాబాద్ ల్యాబుకు మరో మూడు కోళ్లను మహబూబ్ నగర్ ల్యాబు పంపినట్టుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వీపరితంగా ఉండడంతో కోళ్ల షెడ్లను ఖాళీగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. కస్టమర్లు కన్నెత్తిచూడకపోవడంతో చికెన్ షాపులు బోసిపోతున్నాయి. మొన్నటివరకు లైవ్‌కోడి కిలోధర రూ.180 ఉండగా.. ఇప్పుడు కాస్త రూ.90కి పడిపోయింది.
Also read : సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?
Also Read : ఏఐజీ హాస్పిటల్‌కు KCR