/rtv/media/media_files/2025/03/17/R6EZJhCSVFPqL1XSrdUQ.jpg)
SLBC UPDATES
SLBC UPDATES : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆఫరేషన్ 24 వ రోజు కొనసాగుతోంది. మనుషులు వెళ్లలేని ప్రాంతంలోకి రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.టన్నెల్‌లో మనుషులు వెళ్లలేని డి1తో పాటుచివరి ప్రాంతంలో మట్టిని తవ్వేందుకు, రాళ్లు, శిథిలాలు ఎత్తిపోసి బయటికి తరలించేందుకు రోబోలను వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఘటన స్థలంలో ఘటనా స్థలంలో నెట్ వర్క్ ప్రాబ్లం ఎదురవుతోంది. నెట్‌వర్క్ సమస్యతో అంతరాయం ఏర్పడుతోంది.SLBC టన్నెల్‌లో BSNL 3G సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండగా రోబో పని చేయడానికి 5G స్పీడ్ అవసరమవుతుంది.
ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
మాస్టర్ రోబో నుంచి టన్నెల్ లోపల పనిచేసే అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోకు 5G నెట్‌వర్క్ సెటప్‌తో కమాండ్స్ సెట్ చేశారు. టన్నెల్ లో బీఎస్ఎన్ఎల్ 3జి నెట్‌వర్క్ మాత్రమే పని చేయడంతో సమస్య వచ్చినట్లు సమాచారం. దీంతో 3G నెట్‌వర్క్ సెటప్‌తోనే రోబోలు పనిచేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!
కాగా రెస్క్యూ ఆఫరేషన్‌లో భాగంగా టీబీఎం బేస్, ఇతర విడిభాగాలను గ్యాస్ కటర్లతో తొలగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లు డ్రిల్లింగ్ చేసి మట్టిని తవ్వుతున్నారు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే దానిపై వేసేలా రాళ్లను పగలగొడుతున్నారు. లోకో ట్రాలీల వరకు కట్ చేసిన విడిభాగాలు, మట్టిని, రాళ్లను మోస్తున్నారు.13.500 కిలోమీటర్ల తర్వాత సీపేజీసమస్య ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో 5 పంపులు కంటిన్యూగా పని చేస్తున్నా నీటి ఉధృతి తగ్గడం లేదు.
Also Read: రన్యా రావుతో ఇద్దరు మంత్రులకు లింక్..బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్‌మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిత్యం ఉదయం, సాయంత్రం సహయ బృందాల హెడ్స్‌తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు.
ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?
గడిచిన 24 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భారీగా ఊరుతున్న సీపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్‌తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊట నీరుతో సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి.
Also Read: మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి...
Also Read: సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా ?