/rtv/media/media_files/2026/03/24/vamshichnd-reddy-2026-03-24-16-49-58.jpg)
Vamsichand Reddy
Jeevan Reddy: జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెబుతానని ప్రకటించడంతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటికి క్యూకడుతున్నారు. తొలుత మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌లను దూతలుగా పంపిన అధిష్టానం ఆయనతో చర్చించింది. అయితే అయినా తను 25న రాజీనామా చేస్తానని ప్రకటించడంతో మరోసారి చర్చల కోసం కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ ఆయన వద్దకు పంపింది. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి వారికి వివరించారు. ఆయన చెప్పినవన్నీ విన్న మహేష్ కుమార్ హైకమాండ్ అండగా ఉంటుందని జీవన్ రెడ్డికి తెలిపారు.
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఇంటికి క్యూ కడుతున్న నేతలు
— Telugu Feed (@Telugufeedsite) March 24, 2026
ఉదయం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో మొదలైన హడావిడి
జీవన్ రెడ్డి ఇంటికి వచ్చిన ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి
రాహూల్ దూతగా జీవన్ రెడ్డికి బుజ్జగింపు
పీసీసీతో కూడా కాకపోవడంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ pic.twitter.com/ZdY25Hw2C1
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇబ్బందులు వస్తుంటాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ సమీకరణాల వల్ల జీవన్ రెడ్డి ఇబ్బందులు పడ్డారని మహేష్ కుమార్ తెలిపారు. ఆయన రాజీనామా చేయరనే ఆశతో వెళ్తున్నట్లు మీడియాతో వెల్లడించారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఈ వయస్సులో కొంత బాధపడ్డారని మీడియాకు వివరించారు. అయితే జీవన్ రెడ్డి చెప్పిన విషయాలు అన్ని విన్న టీపీసీసీ చీఫ్ వాటిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హమీ ఇచ్చారు. అయితే జీవన్‌రెడ్డి మాత్రం బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ విషయంలో కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది.ఆయనను పార్టీలో చేర్చుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు ఉదయం మహేష్ గౌడ్ చర్చించినప్పటికీ జీవన్ రెడ్డి రాజీనామ విషయంలో వెనక్కు తగ్గనట్టు తెలిసింది. దీంతో రంగంలోకి నేరుగా ఏఐసీసీ దిగింది. ఎఐసీసీ సెక్రెటరీ వంశీచంద్ రెడ్డి రాహుల్ దూతగా రంగంలోకి దిగారు. పీసీసీతోని కాకపోవడంతోనే రంగంలోకి ఎఐసీసీ దిగినట్లు తెలుస్తోంది. వంశీచంద్ రెడ్డి జీవన్ రెడ్డితో చర్చించారు. దీంతో పార్టీ మారే విషయంలో జీవన్ రెడ్డి సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఆయన రాజీనామా చేస్తారా? లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.
Follow Us