/rtv/media/media_files/2025/04/02/1mON43fy5mFa6p1pJn5K.jpg)
HCU land dispute
HCU land dispute :హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వానికి, విద్యార్థులకు మధ్య వివాదం కొనసాగుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో ఆందోళన చేస్తున్నాయి. విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. వామపక్ష విద్యార్థి సంఘాలు చలో సెక్రెటేరియట్‌కు పిలుపునిచ్చాయి. ఇదిలా ఉండగానే ఈ వ్యవహారంపై కేంద్ర పర్యావరణ శాఖ బిగ్‌ట్విస్ట్ ఇచ్చింది. ఈ సందర్భంగా.. రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలి గ్రామంలో అక్రమంగా వృక్షాలను నరికివేయడం, తొలగించడం పై రాష్ట్ర అటవీ శాఖ కు లేఖ రాసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలిగించారని, వన్యప్రాణులు, సరస్సులు, పురాతన రాతి నిర్మాణాలకు నష్టం కలిగించారని వివిధ వార్తా పత్రికల్లో కథనాలు వెలువడినట్లు పేర్కొంది.
Also Read: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
పర్యావరణానికి విఘాతం కలిగించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేగాక ఇకపై వివాదానికి తావు లేకుండా.. యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది. అక్కడ చెట్లు, జంతుజాలానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్రం సలహా ఇచ్చింది. ఈ వ్యవహారంలో నిజా నిజాలపై విచారణ సాగించి, పూర్తి నివేదికను అందించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిని కోరింది. కోర్టులు, ట్రిబ్యునల్స్ గతంలో ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘన లేకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది.
Also Read: ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!
ఆ భూములు ప్రభుత్వానివే... టీజీఐఐసీ కీలక ప్రకటన
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అంగుళం భూమి కూడా లేదని స్పష్టం చేసింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని తెలిపింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది.
400ఎకరాలు అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీజీఐఐసీ వెల్లడించింది. ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉందని స్పష్టం చేసింది. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యతకు ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉందని టీజీఐఐసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటనను హెచ్‌సీయూ ఖండించింది. ప్రభుత్వం చెబుతున్నట్లు హద్దులు నిర్ణయించేందుకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని పర్యావరణం, జీవవైవిద్యం కాపాడటానికి సదరు భూములను హెచ్‌సీయూకే ఇవ్వాలని కోరతామని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ప్రకటన విడుదల చేశారు.
Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!