/rtv/media/media_files/2026/02/13/ponguleti-2026-02-13-16-02-00.jpg)
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అందర్ని షాక్ కు గురిచేశాయి. సాధారణంగా మిత్రపక్షాలుగా ఉండే కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఇక్కడ సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో విడివిడిగా పోటీ చేశాయి. ఈ పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అయితే అనూహ్యంగా సిపిఐ, బీఆర్ఎస్ పార్టీలు జతకట్టడంతో కొత్తగూడెం మున్సిపల్ పీఠం సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
ఒంటరిగా పోటీ చేసిన సిపిఐ 23 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మేయర్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ రాకపోవడంతో, 9 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ మద్దతును సిపిఐ కూడగట్టింది. ఈ క్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సిపిఐ, బీఆర్ఎస్ పార్టీలు పంచుకోనున్నాయి.
కాంగ్రెస్, సిపిఐ విడివిడిగా పోటీ చేయడం కాంగ్రెస్‌కు భారీ నష్టాన్ని చేకూర్చింది. అతిపెద్ద పార్టీగా నిలిచిన సిపిఐ, బీఆర్ఎస్తో జతకట్టడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఈ వినూత్న కూటమి కొత్తగూడెం కార్పొరేషన్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. కాగా ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి మంత్రిగా ఉన్నారు. ఈ రిజల్ట్ ఆయనకు బిగ్ షాకేనని చెప్పాలి.
Follow Us