/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-2026-05-13-18-01-35.jpg)
Bandi Bhagirath
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పొక్సో కేసులో పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. బాధిత బాలిక వివరాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై కొత్త కేసులు నమోదయ్యాయి.
POCSO చట్టం కింద నమోదైన FIR No. 684/2026 లో బాధిత బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆమె తల్లి దండ్రులు వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయనే విషయంపై FIR No. 706/2026, U/s. 74 of the Juvenile Justice Act, Sec. 72(1) of BNS and Sec. 23 of the POCSO Act కింద కేసు నమోదు చేశారు.
అంతేకాకుండా ఇలాంటి కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల ఐడీలకు సంబందించిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆమె తల్లి దండ్రులు సమాచారాన్ని ప్రచురించిన సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బాధితుల గుర్తింపును వెల్లడించడం చట్టప్రకారం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి జైలు శిక్ష, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
బండి సంజయ్‌కు ఊరట
మరోవైపు తన కుమారుడు బండి భగీరథపై నమోదైన పొక్సో (POCSO) కేసు విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ బండి సంజయ్‌కు ఊరటనిచ్చింది. బండి భగీరథ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ పేరును ఎక్కడా వాడకూడదని కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం లేకుండా బండి సంజయ్ పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకూడదని, కథనాలు ప్రసారం చేయకూడదని సివిల్ కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు మీడియాలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తన పేరుతో వచ్చిన ఈ కేసుకు సంబంధించిన పాత వార్తలను, కథనాలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని బండి సంజయ్ కోర్టును కోరారు.
తన కుమారుడిపై నమోదైన కేసును సాకుగా చూపుతూ రాజకీయంగా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు వస్తున్నాయని, తన పేరును ఈ కేసులోకి లాగడం సరికాదని కేంద్రమంత్రి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన సిటీ సివిల్ కోర్టు, ఆయన పేరును ఈ వివాదంలో ప్రస్తావించవద్దని ఆదేశించింది.
Follow Us