/rtv/media/media_files/2026/01/21/jeevan-reddy-2026-01-21-21-51-19.jpg)
EX MLC Jeevan Reddy party change
Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీమంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది.ఆయన బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని , ఈ మేరకు ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది.ఇది కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకే అని చెప్పాలి. ఆయన అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ లో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పలుమార్లు తన సంతృప్తిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయినా పార్టీ నుంచి ఆయనకు ఎలాంటి మద్ధతు లభించలేదు. జగిత్యాల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సంజయ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన వర్గానికి టికెట్లు ఇవ్వకపోవడం, చైర్మన్ ఎన్నికలోనూ ఆయన వర్గానికి ప్రాధాన్యత లభించకపోవడంతో జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి తను కాంగ్రెస్‌లో ఉంటే తనకు టికెట్ దక్కడం కష్టమేనన్న అనుమానంతో ఆయన ఉన్నారు. అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్ లో చేరుతారని తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍తో జీవన్ రెడ్డి భేటీ అయి పార్టీలో చేరిక అంశంపై చర్చలు జరిపినట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. తన పార్టీ మార్పుపై తన సన్నిహితులతో చర్చించిన జీవన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి కారెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్‌లో ఇమడలేక...
జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డి 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో పని చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి వివిధ హోదాలక్లో పనిచేశారు. అయితే 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేయగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అయితే రాజకీయ సమీకరణల నేపథ్యంలో సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.అయితే ఆయన చేరికను జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ విషయమై చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మొన్నటి మున్సిపల్ ఎన్నికలోనూ సంజయ్ వర్గానికే ఎక్కవ సీట్లు ఇవ్వడంతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి తన వర్గానికి దక్కుతుందని జీవన్ రెడ్డి ఆశించారు. కానీ చివరకు సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తికే చైర్మన్ టికెట్ దక్కడంతో జీవన్ రెడ్డి అసహానానికి గురైనట్లు సమాచారం. ఈక్రమంలో ఇక తాను కాగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నట్లు ఆయన సంచలన వ్యా్‌ఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్ ఏంటో గోచరించడం లేదని, అవమానాలు ఇంకెంతకాలం భరించాలని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇక తన రాజకీయ భవిష్యత్ పై ---సన్నిహితులతో చర్చ తరువాత రాజీనామా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కేసీఆర్,కేటీఆర్‌తో టచ్‌లోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డి ---బీఆర్ఎస్‌లోకి వెళ్తారని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Follow Us