/rtv/media/media_files/2026/04/20/fotojet-2026-04-20-12-04-01.jpg)
jeevan reddy jain brs
BIG BREAKING: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. ఈ రోజు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఈ రోజు జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు. జీవన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ పర్వీన్ భర్త మున్నాభాయ్‌తో పాటు పలువురు కౌన్సెలర్ల భర్తలు కూడా బీఆర్‌ఎస్ లో చేరుతున్నారు. వారిలో రమేష్ రావు, గాజుల రాజేందర్, గాజుల మహేష్, రజనీకాంత్,వదినని రామ్మోహన్, జగన్ రెడ్డి, మేక పవన్, పద్మావతి తదితరులు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ఈరోజు(ఏప్రిల్ 20)వ తేదీన సాయంత్రం భారీ బహిరంగ సభ జరుగుతుంది గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాగా, ప్రస్తుతం బీఆర్‌ఎస్ లో చేరుతున్నావారంతా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి చెందినవారు కూడా ఉన్నారు.మరి కొందరు కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డితో పాటే మేము నడుస్తాము అంటూ జగిత్యాల మున్సిపాలిటీ చెందిన కౌన్సిలర్లు ,కౌన్సిలర్ల భర్తలు గులాబీ పార్టీలో చేరుతున్నారు.
జగిత్యాల జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. అదెంటంటే జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనైనప్పటికీ అధికార పక్షంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పదేపదే చెప్తున్నారు. ఆయన బాటలోనే మేము నడుస్తామంటున్న కౌన్సిలర్ల భర్తలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అంటే భార్యలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సంజయ్ వర్గంగా కొనసాగనుండగా, భర్తలు మాత్రం బీఆర్‌ఎస్‌లో చేరి జీవన్ రెడ్డి వర్గంగా కొనసాగనుండటం గమనార్హం.
Follow Us