Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ రిలీఫ్ ఆ మూడు కేసుల్లో ....

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట లభించింది. ఇప్పటికే పలుకేసుల్లో నిర్ధోషిగా తేలగా, మరో 3కేసుల్లో రాజాసింగ్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామనవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించి మూడుకేసులు నమోదయ్యాయి.

New Update
MLA Rajasingh

MLA Rajasingh

Raja Singh: వివాదస్సద నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు గొప్ప ఊరట లభించింది. ఇప్పటికే పలు కేసులు కొట్టుడు పోగా మరో మూడు కేసుల్లో రాజా సింగ్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించిన మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు బీజేపీ శాసనసభ్యుడు టి. రాజా సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.

 Also Read: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌ లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!

కాగా.. గోషామహల్‌‌‌‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌‌పై 2022లో పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. 2022 ఫిబ్రవరి 19న మంగళ్‌‌‌‌హాట్‌‌‌‌ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా పీడీ యాక్ట్ ప్రయోగించారు. అరెస్టు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. రాష్ట్రంలోనే తొలిసారి ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ప్రయోగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మతపరమైన కామెంట్లు చేశారనే ఆరోపణలతో రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ టైమ్ లో 41 సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు గైడ్​ లైన్స్ పాటించలేదని రాజాసింగ్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. రాజాసింగ్‌‌‌‌ రిమాండ్‌‌‌‌ రిజెక్ట్‌‌‌‌ కావడంతో పోలీసులు లీగల్‌‌‌‌ ఒపీనియన్ తీసుకున్నారు. ఆయనపై గతంలో నమోదైన కేసులను కొత్తగా పరిశీలించారు. పీడీ యాక్ట్‌‌‌‌ ప్రయోగించేందుకు అనుకూలంగా మంగళ్‌‌‌‌హాట్‌‌‌‌, షాహినాయత్‌‌‌‌ గంజ్‌‌‌‌ స్టేషన్లలో నమోదైన కేసులు గుర్తించారు. తాజాగా ఈ కేసుల్లో రాజా సింగ్ నిర్దోషిగా తేలారు.

 Also Read: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ రిలీఫ్

కాగా గత శుక్రవారం ఆయన మీదున్న విద్వేషపూరిత ప్రసంగం కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు ఐదు పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్‌పై విద్వేషపూరిత ప్రసంగం కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులపై శుక్రవారం విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు మరోసారి రిపీట్ కావొద్దని హెచ్చరిస్తూ కొట్టివేసింది. కాగా, రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాపై మెటా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన ప్రదర్శనలకు సంబంధించి ఆయన పోస్టు చేసిన వీడియోలను తొలగించింది. రాజాసింగ్ 2024వ సంవత్సరంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. రాజాసింగ్ పాల్గొన్న రాజకీయ ర్యాలీలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, మతపరమైన ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు, జాతీయ వాద ర్యాలీల వీడియోలను అధ్యయనం చేసి అవి ద్వేషపూరితమైనవని నిర్ధారించింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను ఐటీ దిగ్గజ సంస్థ మెటా తొలగించింది.

Also Read: పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌కు అమెరికా బిగ్ షాక్.. ప్రయాణాలు నిషేధం !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు