/rtv/media/media_files/2025/01/28/F84UXyQn9pNJIJZ4Tpv6.webp)
bhupala palli crime
TG Crime: టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినా.. ప్రజల్లో మాత్రం మూఢనమ్మకాల భయం తగ్గటం లేదు. తాజాగా మంత్రాల నేపంతో ఒక వృద్ధురాలని దారుణంగా హత్య చేసిన ఘటన భూపాలపల్లి జిల్లాలో కలగలం రేపుపుతోంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. టేకుమట్ల మండలం గుర్మిళ్ళపల్లి శివారులో బోయినపల్లి గ్రామానికి చెందిన సొరపాక వీరమ్మ(70) నివాసం ఉంటుంది. ఈనెల 19న బుధవారం చింతపండును విక్రయించుకుని గుమ్మిల్లపల్లి గ్రామానికి వెళ్లి అక్కడే అదృశ్యమయ్యారు. ఈనెల 23 ఆదివారం ఉదయం ఓ వ్యవసాయ బావిలో వీరమ్మ శవం కనిపించింది. అంతేకాదు ఆమెను హత్య చేసి 2 తులాల బంగారు గొలుసు, 30 తులాల వెండి కడియాలు ఎత్తుకెళ్లారు.
Also Read: హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే
మంత్రాల నెపంతో..
వీరమ్మ మృతి చెందటంతో కుటుంబ సభ్యులు టేకుమట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిట్యాల సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ సంపత్‌రావు, సీఐ మల్లేశ్, టేకుమట్ల ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి పలువురు అనుమానితులను విచారించారు. బోయినపల్లికి చెందిన బోయిని మల్లయ్య, పుట్టకొక్కుల శ్రీనివాస్ ఆలియాస్ కిట్టూ, గర్మిళ్లపల్లికి చెందిన మద్దెల సిద్దూ వీరమ్మను హత్య చేసినట్లు ఒప్పకుని పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఇది కూడా చదవండి: శరీరాన్ని శుభ్రపరిచే మూడు డీటాక్స్ డ్రింక్‌లు
అయితే మల్లయ్య కుమార్తె కొంత కాలంలగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీనికి కారణం వీరమ్మ మంత్రాలే అని అనుమానం పెంచుకున్నాడు. ఆమెను చంపితే కూతురు ఆరోగ్యం బాగుపడుతుందని కిట్టూ, సిద్దూ సాయం కోరాడు. ఈ మూగ్గురు కలిసి రెండు నెలలుగా వీరమ్మ కదలికలను గమనిస్తూ వచ్చారు. చివరికి ఈనెల 19న ఒంటరిగా వెళ్తున్న ఆమెను బైక్‌పై వెంబడించారు. గర్మిళ్లపల్లి గ్రామం దగ్గరకు రాగానే పొదల్లోకి లాక్కెళ్లి హతమార్చారని డీఎస్పీ వివరాలను వెల్లడించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇలా చేస్తే చర్మంపై కాలిన గాయాలు మాయం అవుతాయి
Also Read: Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా