/rtv/media/media_files/2025/02/09/HZ0y1IxdcdMWNSeIGtqP.webp)
BJP TELANGANA
BJP TELANGANA : ఢిల్లీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు తెలంగాణ పై దృష్టి సారించారు.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణలో బీజేపీ బలంగా పుంజుకున్నట్లు కనిపించింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేకుండా సంజయ్‌ని తప్పించి బీజేపీ సీనియర్ నేత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపకపోగా కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 స్థానాలకే పరిమితమైంది.ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర పార్టీ చీఫ్ నియామకంపైన దృష్టి సారించింది.
Also Read : వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో
తిరిగి బండి సంజయ్‌కే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం సాగినప్పటికీ ఆయనకు కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించడంతో ఇక ఆయనకు అవకాశం లేదని తేలిపోయింది. ఈ క్రమంలో కొత్త పార్టీ చీఫ్ నియామకం పైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సత్తా చాటిన బీజేపీ దక్షిణాదిలో తెలంగాణ నుంచి తమ ఆపరేషన్ మొదలు పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం పైన త్వరలోనే ప్రకటన రానుంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన పార్టీ నాయకత్వం వచ్చే వారం అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : HIV ఉండగానే తల్లీ కూతుళ్లతో టీచర్ అక్రమ సంబంధం! చివరికి ఏమైందంటే
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపాలని భావిస్తోన్న బీజేపీ అందులో భాగంగా తెలంగాణలో సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సీఎం నినాదం తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అనూహ్యంగా ఎనిమిది సీట్లు దక్కటంతో తెలంగాణ పైన పట్టు చిక్కినట్లు భావిస్తున్న పార్టీ నాయకత్వం..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. జమిలి ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కసరత్తు పూర్తి చేసింది. అధ్యక్షుడితో పాటుగా పార్టీలో కీలక మార్పులకు శ్రీకార చుట్టాలని బీజేపీ భావిస్తోంది.
Also Read : సమ్మర్‌లో అదిరిపోయే టూర్.. నల్లమల్ల టూరిజం స్పెషల్ ప్యాకేజీ
పార్టీలో పలు జిల్లాల్లో నాయకుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు పార్టీ గుర్తించింది. దీంతో, అందరినీ కలుపుకొని ముందుకెళ్లే నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించాలని డిసైడ్ అయింది. అందుకు మాస్ లీడర్ అయితే బాగుంటుందని, అందులోనూ బీసీ నేతకు ఇస్తే బాగుంటుందని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అధ్యక్షుడిగా ముదిరాజ్ వర్గానికి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే , ఈటలను ప్రకటిస్తారని డిసైడ్ అయినప్పటికీ సీనియర్లు మాత్రం అధ్యక్ష పదవి కోసం తుది ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈసారి అధ్యక్ష రేసులో అనూహ్యంగా మురళీధర్ రావు, డీకే అరుణ పేర్లు తెర మీదకు వచ్చాయి. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి.. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండటంతో ఇప్పుడు రెడ్డి వర్గానికి అవకాశం ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో,డీకే అరణకు అవకాశం దక్కకపోవచ్చు. ఇక బీసీ వర్గానికే అధ్యక్ష పదవి ఖాయమైందని, అందులోనూ మాస్ లీడర్‌గా ముద్ర పడ్డ ఈటలకే ఆపదవి ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. ఇక పోటీలో ఉన్న సీనియర్ నేతలకు పార్టీ ఇతర బాధ్యతలు అప్పగించి పార్టీని ఒక తాటిపైఇ తీసుకురావాలని కేంద్ర నాయకత్వం భావిస్తోందట.
ఇది కూడా చదవండి: నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా?