BIG BREAKING: బండి సంజయ్ కొడుకు కేసు.. DGPకి సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు!

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేంద్రమంత్రి బండిసంజయ్‌ కొడుకు బండి భగీరథపై నమోదైన కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా కేసు సమగ్ర, నిష్పక్షపాత విచారణ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు.

New Update
bandi sanjay

bandi sanjay son case

 BIG BREAKING: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కొడుకు బండి భగీరథపై నమోదైన కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఫిర్యాదు, కేసు నమోదు వ్యవహారంలో పోలీసుల ఆలస్యంపై సీఎం సీరియస్ అయ్యారు. ఈ కేసుపై తక్షణమే దర్యాప్తును వేగవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.మే 8వ తేదీన బాధితుల నుంచి ఫిర్యాదు అందినా, ఇప్పటివరకు ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదని డీజీపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత సున్నితమైన కేసులో జాప్యం జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, కేసు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి ప్రశ్నలకు డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ కేసు వివరాలను నివేదించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారని, అందుకే తదుపరి చర్యల్లో కొంత ఆలస్యం జరిగిందని ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. డీజీపీ వివరణ విన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆలస్యం లేకుండా కేసు సమగ్ర, నిష్పక్షపాత విచారణ కోసం తక్షణమే ప్రత్యేక పోలీస్ బృందాలను (Special Teams) ఏర్పాటు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. చట్ట ప్రకారం విచారణను వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని స్పష్టం చేశారు.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన వివాదాస్పద కేసుపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేగుతోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమీక్ష జరిపారు.ఈ కేసుపై తక్షణమే విచారణ ప్రారంభించాలని రాష్ట్ర పోలీసు బాస్, డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు. చట్టం ముందు ఎవరైనా సమానులేనని, బాధితులకు తక్షణమే న్యాయం జరగాలని స్పష్టం చేశారు.ఏ రకమైన రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగిందంటే..?

ఒక మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై బండి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను భగీరథ్ తోసిపుచ్చారు. సదరు బాలిక కుటుంబ సభ్యులు తనను హనీట్రాప్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారంటూ ఆయన కూడా ఎదురు కేసు (కౌంటర్ కేసు) పెట్టారు. ఈ రెండు పరస్పర ఫిర్యాదులతో తీవ్ర సంచలనంగా మారిన ఈ కేసును అత్యంత పకడ్బందీగా తేల్చాలని ముఖ్యమంత్రి భావిస్తుండటంతో, పోలీసు శాఖ తదుపరి తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు