Bandi Sanjay: KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

TG: బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీష్ రావు మధ్య పంచాయితీ నడుస్తోందని అన్నారు బండి సంజయ్. ఒకరికొకరికి పడడం లేదని ఆరోపించారు. అసలు కేసీఆర్ లేకపోతే కేటీఆర్‌ను ఎవరు పట్టించుకుంటారు? అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను వదలము అని హెచ్చరించారు.

New Update
Bandi Sanjay VS KTR: కవిత బెయిల్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు నడుమ పంచాయితీ నడుస్తోందని అన్నారు. ఒకరికొకరికి పడడం లేదని ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం RKH ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. రాజ్ పాకాల మందు దందాలో దొరికితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ను ఎవరు పట్టించుకోరని చెప్పారు. అలాగే తమ బీజేపీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రక్షాళన పేరుతో పేద ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ను వెంటాడుతాం.. వేటాడుతామని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి: 'రేవంత్‌ను చంపేందుకు కుట్ర'

సంజయ్ కు కేటీఆర్ నోటీసులు...

ఇది కూడా చదవండి: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు!

ఇటీవల బండి సంజయ్ తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నెల 19 వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు!

కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని...

కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండి సంజయ్ చేసిన నిరాధారమైన కామెంట్లను నోటీసులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా తీశారని చెప్పారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులో తెలిపారు. కేవలం తనను అప్రతిష్టపాలు చేయాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. 

ఇది కూడా చదవండి:  బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు