/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-and-bandi-sanjay-2026-05-13-14-38-57.jpg)
Bandi Bhagirath and Bandi sanjay
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తనపై నమోదైన పోక్సో (POCSO) కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయారు. లాయర్ల సమక్షంలో ఆయన విచారణకు హాజరయ్యారు. తన కుమారుడి లొంగుబాటుపై కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా స్పందించారు. చట్టం మీద ఉన్న గౌరవంతో, విచారణకు సహకరించడం కోసమే తన కొడుకును పోలీసులకు అప్పగించానని ఆయన స్పష్టం చేశారు.
చట్టానికి లోబడి ఉండాలి
చట్టం ముందు తన బిడ్డైనా, సామాన్యుడైనా ఒకటేనని, మనమందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని అన్నారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని తనకు చెప్పాడని మంత్రి పేర్కొన్నారు. మొదట ఫిర్యాదు రాగానే స్టేషన్‌లో అప్పగిద్దామని అనుకున్నానని, అయితే న్యాయ నిపుణులను సంప్రదించి తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందు ఉంచినట్లు తెలిపారు. ఆ ఆధారాలను చూసిన లాయర్లు... కేసు కొట్టేస్తారని, కచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పడం వల్లే పోలీసుల ముందుకు రావడంలో కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు.
ఇప్పుడు కూడా భగీరథ్‌కు బెయిల్ వస్తుందని లాయర్లు చెబుతున్నారని, తనకు న్యాయవ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందని బండి సంజయ్ అన్నారు. రాబోయే సోమవారం నాడు కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ... న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం చేయడం ఇష్టం లేకనే, తన కొడుకుని విచారణ నిమిత్తం పోలీసుల వద్దకు పంపించినట్లు స్పష్టం చేశారు.
Follow Us