BIG BREAKING : బండి సంజయ్ తల్లికి గుండెపోటు: ఆసుపత్రికి తరలింపు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల (83) శుక్రవారం గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు.

New Update
bandi

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల (83) శుక్రవారం గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. తొలుత కరీంనగర్‌లో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో ఆమెను చేర్పించి అత్యవసర చికిత్స ప్రారంభించారు. శకుంతలమ్మను పరీక్షించిన మెడికవర్ వైద్య బృందం, ఆమె గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆమెకు స్టంట్ వేసి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. తల్లి అనారోగ్య వార్త తెలిసిన వెంటనే బండి సంజయ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను, కోలుకోవడానికి పట్టే సమయాన్ని ఆరా తీశారు. బండి సంజయ్ తల్లికి గుండెపోటు వచ్చిందన్న వార్త తెలియడంతో బీజేపీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు