/rtv/media/media_files/2025/01/27/SO1FO9R4UqdX9jNmlOhS.webp)
suicide hyderabad
TG Crime: ఈ మధ్య కాలంలో భార్యాభర్తల గొడవులు ఎక్కువగా జరుగుతున్నారు. జీవితాంత కలిసి జీవించాల్సిన దంపతులు చిన్నపాటి విషయాలకే చిటికి మాటికి గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరి కొందరైన ఏకంగా ప్రాణాలు తీస్తున్నారు. మీర్‌పేట్ ఘటనే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు అలాంటి మరో ఘటన భాగ్యనగరంలో కలకలం రేపంది. భార్యపై అనుమానంతో పని చేసే దగ్గకు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు.
భార్యపై అనుమానంతో..
స్థానికుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో మౌనిక, శ్రావణ్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. మౌనిక సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లోని కామాక్షి సిల్క్స్ క్లాత్ షోరూమ్‌లో ఉద్యోగం చేస్తున్నది. శ్రావణ్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ సమయంలో ఆదివారం మధ్యాహ్నం షాప్‌కు వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. తిరిగి సాయంత్రం షాప్‌కు పెట్రోల్ బాటిల్‌తో వచ్చాడు. భార్య పనిచేసే షాపులోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించున్నాడు. ఈ ప్రమాదంలోఈ ఇద్దరు 98 శాతం గాయాలు కాగా.. ప్రస్తుతం మౌనిక, శ్రావణ్ కండిషన్సీ రియస్‌గా ఉన్నదని డాక్టర్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగారంటే ఈ సమస్యలన్నీ పరార్
షాప్‌లో కస్టమర్లు ఉన్న సమయంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేయటంతో.. అక్కడ ఉన్న కస్టమర్లు దుకాణం నుంచి భయంతో పరుగులు తీశారు. పక్కనే ఉన్న బట్టలకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదంపై రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడ్డ శ్రావణ్నును వెంటనే 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసి అత్యవసర ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్లు.వీరి శరీరం దాదాపు 98 శాతం కాలిపోయినట్టు క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. శ్రావణ్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కిచెన్ సింక్ జామ్ అవుతోందా..? ఈ చిట్కాలతో క్లియర్ చేయండి