TS: ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ఈ నెల నుంచి నిర్వహించనున్నట్లు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈనెల 9న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. By Manogna alamuru 04 Dec 2024 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఈనెల తొమ్మిది నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎన్ని రోజులపాటు నిర్వహిస్తారనేది అదే రోజు ఉదయం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. అయితే ఇప్పటికే సమావేశాల్లో ఏం చర్చించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సంక్రాంతి తరువాత రైతు భరోసా వేస్తామని సీఎం ప్రకటించారు. అయితే, అందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే పలు అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటూ కొత్తగా తీసుకురానున్న ఆర్వోఆర్ చట్టంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కులగణన సర్వే ద్వారా వచ్చే గణాంకాలను అసెంబ్లీలో పెట్టి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబతున్నాయి. కేసీఆర్ వస్తారా? ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో రేవంత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేసీఆర్ వస్తారా లేదా అనేది మాత్రం ఆ రోజు వరకూ తెలిసే అవకాశం లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనలేదు. Also Read: Pushpa-2: పుష్ప–2 ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి