/rtv/media/media_files/2025/03/16/6KZvqnF10AD0acYt4MJr.jpg)
potti sreeramulu telugu university
Potti Sri Ramulu : హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పును ఆర్యవైశ్యులు వ్యతిరేకిస్తున్నారు. విశ్వవిద్యాలయానికి ఆయన పేరునే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పేరు మార్పుపై రేవంత్ రెడ్డిపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువిశ్వవిద్యాలయంకు పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. దేశభక్తుడైన అమరజీవి పొట్టిశ్రీరాములును కాంగ్రెస్ అవమానిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశస్వాతంత్ర్యం కోసం హరిజన గిరిజన హక్కుల కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాలకోసం తన ప్రాణాలను అర్పించిన పొట్టిశ్రీరాములును ఆంధ్రాకు చెందిన వ్యక్తిగా పరిగణించడం సరైందికాదని మండిపడ్డారు.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పేరు, కాసు బ్రహ్మానందారెడ్డి పార్కు పేరు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేరు మార్చే దమ్ము సీఎం రేవంత్ కు ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం పేరుమార్పు విషయంలో రాజకీయ పార్టీల మద్దతు కోరుతామని ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ప్రకటించారు.
Also read: Starbucks : తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం
పేరు మార్పు సరికాదు- -బండి సంజయ్
పొట్టి శ్రీరాములు పేరిటనున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరును తొలగిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు గొప్ప దేశభక్తుడు, గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడని ఆర్యవైశ్యుల ఆరాధ్య నేత అని కొనియాడారు. అట్లాంటి గొప్ప నేత పేరును మార్చాల్సిన అవసరం ఏముందన్నారు. సురవరం ప్రతాపరెడ్డి అంటే మాకు గౌరవముందని, తెలుగు భాష ఉన్నతికి క్రుషి చేశారన్నారు. తెలుగు భాషాభివ్రుద్ధికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఆయన పేరును పెట్టుకుంటే అభ్యంతరం లేదన్నారు.
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
కానీ పొట్టి శ్రీరాములు తొలగించి అవమానించడం కరెక్ట్ కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన కులాభిమానంతోనే పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించారన్నారు. సీఎం తీరు దేశభక్తులు, స్వాతంత్ర్య సమరయోధులతోపాటు ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. పొట్టి శ్రీరాములంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష ప్రాణాలర్పించిన అమరజీవి మాత్రమే కాదని,గొప్ప దేశభక్తుడన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడని, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులను వదిలేసుకుని దేశం కోసం పోరాడిన వ్యక్తి అన్నారు. మహాత్మాగాంధీజీ ఇష్టమైన వ్యక్తి. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడన్నారు. సత్యాగ్రహా, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 3సార్లు జైలుశిక్ష అనుభవించాడని, హరిజనోద్యమం కోసం అనేక పోరాటాలు చేసిన నాయకుడన్నారు. మహనీయులను కాంగ్రెస్ పార్టీకి అవమానించడం అలవాటుగా మారిందన్నారు.
ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?