/rtv/media/media_files/2025/02/22/AB877DP0tOOB60FYoZlT.jpg)
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది.
నాలుగు రోజుల క్రితం ఎడమవైపు సొరంగం వద్ద మళ్లీ పనులు ప్రారంభం కాగా, శనివారం ఉదయం పైకప్పు కూలింది. ఇందులో ఏడు మంది కార్మికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. క్షతగాత్రలను వెంటనే జెన్ కో ఆసుపత్రికి తరలించారు.
Also Read : దొంగిలించిన డబ్బుతో లవర్లతో కలిసి మహాకుంభమేళాకు..చివరకు బిగ్ ట్విస్ట్!
Also Read : పెళ్లి కార్డుతో సైబర్ ఎటాక్.. క్షణాల్లోనే 75 వేల రూపాయలు మాయం!
మంత్రి ఉత్తమ్ ఆరా
ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు. అధికారులు వెంటనే సహయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదం జరిగినట్లు తనకు ఇప్పుడే తెలిసిందన్న మంత్రి.. ఘటనా స్థలానికి వెళ్తున్నానని తెలిపారు. టన్నెల్ లోపల ఎంత మంది చిక్కుకున్నారనే వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
2005లో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 వేల 200 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు పనుల గడువును ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఆరుసార్లు పొడిగించాయి. తాజా గడువు 2026 జూన్ వరకు ఉంది. 2017లో ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.3 వేల152.72కోట్లకు పెంచగా.. ఈ మధ్యే కాంగ్రెస్ సర్కార్ మరోసారి 4 వేల 637కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటిదాకా రూ.2 వేల 646కోట్లు ఖర్చు చేశారు.
Also Read : మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!
Also Read : ఆకాశంలో ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుందా...విమనాలకు దారెలా తెలుస్తుంది..