Suicide : పిల్లలకు విషమిచ్చి తాను తాగి....

భర్తమీద కోపం, క్షణికావేశం తల్లితో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది. భర్తపై కోపంతో పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య చేసుకుంది. తల్లి రెండు రోజుల క్రితం మృతి చెందగా ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఈరోజు ప్రాణాలు వదిలారు.

New Update
jagithyal suicide

jagithyal suicide

Suicide : భర్తమీద కోపం, క్షణికావేశం తల్లితో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది. భర్తపై కోపంతో పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య చేసుకుంది. తల్లి రెండు రోజుల క్రితం మృతి చెందగా ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఆదివారం ప్రాణాలు వదిలారు. ముగ్గురు మృతితో జగిత్యాల జిల్లా మద్దులపల్లిలో విషాదం నెలకొంది.

Also Read :  Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్‌ ఉందబ్బా!

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. కంబాల హారిక భర్త తిరుపతిపై కోపంతో తొమ్మిదేళ్ళ కొడుకు కృష్ణాంత్, 8 ఏళ్ళ కూతురు మాయంతలక్ష్మికి ఈనెల 14న సాయంత్రం గడ్డి మందు తాగించి తాను తాగి ఆత్మహత్య చేసుకుంది. హారిక 14న రాత్రి జగిత్యాల ఆసుపత్రిలో మృతి చెందగా ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. కాగా పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.తల్లితో పాటు ఇద్దరు పిల్లల మృతికి భర్త తిరుపతే కారణమని ఆరోపిస్తూ హారిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!


పోలీసులు, గ్రామస్తుల సమాచారం మేరకు ఒగ్గు కళాకారుడు అయిన కంబాల తిరుపతికి జగిత్యాలకు చెందిన హారికతో పన్నేండేండ్ల క్రితం పెళ్లయింది. వీరికి కుమారుడు కృష్ణంత్, కూతురు మాయంతలక్ష్మి ఉన్నారు. కాగా తిరుపతి వ్యవసాయంతో పాటు ఒగ్గు కథలు చెప్తూ జీవనం సాగిస్తున్నాడు. తిరుపతి గురువారం మధ్యాహ్నం కూడా ఒగ్గుకథ చెప్పడానికి వెళ్లిన సమయంలో హారిక తన ఇద్దరి పిల్లలకు గడ్డి మందు తాగించి తాను తాగింది. ఈ విషయాన్ని భర్త తిరుపతికి వీడియోకాల్ చేసి చెప్పింది.కంగారు పడిన తిరుపతి గ్రామంలోని సమీప బంధువుకు చెప్పగా ఆయన వెళ్లి చూసేప్పటికీ ముగ్గురు ఆపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం జగిత్యాలకు అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. కాగా చికిత్స పొందుతూ హారిక అదే రోజు చనిపోగా, పిల్లలు ఈ రోజు చనిపోయారు.

ఇది కూడా చదవండి: వాళ్లు అప్లై చేసుకోవద్దు.. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లపై బిగ్ ట్విస్ట్!

కాగా తిరుపతికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని హారిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం తిరుపతి హారికకు వివాహం కాగా ఇద్దరు పిల్లలు పుట్టాక వరకట్నం కోసం వేధించడంతోపాటు మరో మహిళతో సంబంధం నెరపడంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయని చెప్తున్నారు. హారిక ఇద్దరు పిల్లల మృతికి కిరణమైన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా చర్యలు ఉండాలని హారిక సోదరుడు, మరదలు విజ్ఞప్తి చేశారు.భార్య ఇద్దరు పిల్లలు మృతితో ఇక తానెందుకు బతకాలని బోరున విలపించాడు భర్త తిరుపతి. హారిక పుట్టింటి వారు ఫిర్యాదు మేరకు పెగడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు.  

Also Read: గుండెపోటుతో వరుడు ఎలా మృతి చెందాడో చూడండి.. వీడియో చూస్తే గుండె పగలాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment