/rtv/media/media_files/2025/02/21/6AEaY0KWzNXIYcCz4l7t.jpg)
fire accident in hotel
Fire Accident : మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ లో ఉన్న అరేబియన్ నైట్స్ అనే హోటల్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిస పడడంతో హోటల్ రెండో అంతస్తులో ఆరుగురు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుంది.అగ్ని మాపక శకటాలు మంటలార్పుతుండగానే,.. మరికొంతమంది మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఒక్కసారిగా హోటల్ లో మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది. ఒక్కసారిగా హోటల్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ ఎత్తున శబ్ధాలతో కూడిన మంటలు ఎగిసిపడుతుండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మంటలు ఆర్పేందుకు స్థానికులు సైతం సహాయక చర్యలు అందించారు. మరోవైపు మంటలతో కూడిన పొగ కూడా చుట్టు ప్రాంతాల్లో అలుముకుంది.
Also Read: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ .. 15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్ !
ప్రస్తుతం ఘటనా స్థలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అటు స్థానిక పోలీసులు సైతం సహాయక చర్యలు అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది అంచనా వేసింది. ఎండల తీవ్రతల పెరుగుతుండటంతో హోటల్స్, షాపింగ్ మాల్స్, దాబాలు, ప్రైవేటు సంస్థలు, కెమికల్ కంపెనీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. కాగా మంటల్లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది క్షేమంగా రక్షించినట్లు స్థానికులు తెలిపారు.