గణేశ్ నిమజ్జనోత్సవం.. సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సం సందర్భంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. By B Aravind 13 Sep 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలతో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడా చూసినా గల్లిగల్లీకి వినాయక మండపాలతో, భక్తి పాటలతో శోభిత వాతవరణం నెలకొంది. అయితే సెప్టెంబర్ 17న వినాయక నిమజ్జనోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులను సమన్వం చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. Also Read: ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి మరణ శిక్ష అలాగే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు జరిగేలా నిర్వాహకులతో చర్చించామని.. ఇందుకు వాళ్లు అంగీకరించినట్లు తెలిపారు. నగరంలో మొత్తం అన్ని రకాల విగ్రహాలు కలిపి సుమరు లక్ష వరకు ఉండొచ్చని చెప్పారు. హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జనోత్సవం చూసేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు వస్తారని.. వీళ్లను దృష్టిలో ఉంచుకొని బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. #telugu-news #ganesh-immersion #vinayaka-immersion మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి