/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-2026-05-13-18-01-35.jpg)
Bandi Bhagirath
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరపర్చగా, ఆయన భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను అర్ధరాత్రి దాటిన తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందాలని, అరెస్టు నుండి రక్షణ కల్పించాలని భగీరథ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే-. అయితే అతనికి న్యాయస్థానంలో ఎలాంటి ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే సైబరాబాద్ పోలీసులు భగీరథ్‌పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
బండి సంజయ్ కీలక ప్రకటన
అయితే పోలీసులు తాము భగీరథ్ ను అరెస్ట్ చేశామని చెబుతుండగా, శనివారం రాత్రి 8 గంటల సమయంలో భగీరథ్ తండ్రి, ఎంపీ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తన కుమారుడిని తానే స్వయంగా పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే పోలీసులు భగీరథ్‌ను అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. పోలీస్ అకాడమీ సమీపంలో భగీరథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అరెస్టు ప్రక్రియ ముగిశాక, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో భగీరథ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం రాత్రి మేడ్చల్‌లోని న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట హాజరపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు ఆదేశాల తర్వాత, రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు భగీరథ్‌ను చర్లపల్లి కేంద్ర జైలుకు తరలించారు.
మరోవైపు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. కుకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో పోలీసులు ఫామ్‌హౌస్‌లు, హోటల్ రికార్డులు, ఐపీ లాగ్స్ సేకరిస్తూ క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
తాము సాధారణ మధ్యతరగతి కుటుంబమని, తమపై ఎదురు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితురాలి తల్లి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టం ప్రకారం తమకు న్యాయం జరగాలని ఆమె కోరారు.
Follow Us