KTR: కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు! బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. కేటీఆర్ వ్యాఖ్యలు సుమోటాగా స్వీకరించిన కమిషన్.. ఆగస్టు 24న కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. By srinivas 16 Aug 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Women's Commission: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వ్యాఖ్యలు సుమోటాగా స్వీకరించిన కమిషన్.. ఆగస్టు 24న కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే విచారం వ్యక్తం చేసిన కేటీఆర్ సారీ చెప్పినా నోటీసులు పంపించింది మహిళా కమిషన్. Telangana State Commission for Women has issued a notice to Sri K. Taraka Rama Rao, asking him to appear in person on 24 Aug 2024 regarding alleged derogatory remarks about women.@sharadanerella — Telangana State Commission for Women (@SCWTelangana) August 16, 2024 విచారం వ్యక్తం చేస్తున్నా.. ఈ మేరకు ఎమ్మెల్యే కేటీఆర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై గురువారం కార్యకర్తల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దీనిపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మహిళలపై బీఆర్ఎస్ నేతలకు ఉన్న గౌరవం ఇదేనా కేటీఆర్?.. మీ నాన్న కేసీఆర్ నీకు నేర్పిన సంస్కారం ఇదేనా?అంటూ మండిపడ్డారు. అలాగే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. 'నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.” అని అన్నారు. he Telangana Women’s Commission has taken suo moto cognizance of a media post made by you, Sri K. Taraka Rama Rao, Hon'ble Legislator, Sirisilla Constituency.@sharadanerella #Sirisilla #RTV pic.twitter.com/rR5oDxryOc — RTV (@RTVnewsnetwork) August 15, 2024 #ktr #notice #telangana-womens-commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి