Venu Swamy: వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు!

పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్న జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదుపై చర్యలకు సిద్ధమైంది.

New Update
Venu Swamy: వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు!

Notices To Venu Swamy:  ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women Commission) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.. ఆగస్టు 22న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.

నాగ చైతన్య- శోభిత దూళిపాల (Naga Chaitanya - Sobhita Dhulipala) పెళ్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వేణుస్వామిపైనే కాకుండా ఆయన వీడియోలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని మహిళా కమీషన్ తెలిపింది.

Notices To Venu Swamy

ఇదిలా ఉంటే.. ఇటీవలే వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నాగచైతన్య- శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత మరోసారి కాంట్రవర్సీకి తెరలేపి విమర్శలపాలవున్న జ్యోతిష్యుడు ఇకపై సెలబ్రిటీల లైఫ్ కు సంబంధించి జ్యోతిష్యం చెప్పనని ప్రకటించాడు. చైతూ, శోభిత నాలుగేళ్ల తర్వాత విడిపోతారని చెప్పడంతో అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వేణుస్వామిపై దుమ్మెత్తిపోశారు. విపరీతంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. దీంతో తాజాగా స్పందించిన వేణుస్వామి ఇకపై సినిమా, రాజకీయ రంగాల వారి జాతకాలు చెప్పనంటూ యూటర్న్ తీసుకున్నాడు. వేణుస్వామి మాట్లాడుతూ.. ‘గతంలో నేను చెప్పిన మాటకు కట్టుబడే ఉన్నా. అప్పుడు నాగచైతన్య- సమంత (Naga Chaitanya-Samantha) జ్యోతిష్యం చెప్పాను. అందుకే వేణుస్వామి దానికి కొనసాగింపుగా నాగచైతన్య-శోభిత భవిష్యత్తు చెప్పాల్సి వచ్చింది. నేను సెలబ్రెటీల జ్యోతిష్యం జోలికి పోను. అభిమానులు కూడా నా నుంచి జ్యోతిష్యం ఆశించవద్దు. మా ప్రెసిడెంట్ మంచు విష్ణుతో కూడా వివరంగా మాట్లాడిన’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: హింసాత్మక పోర్న్ చూస్తూ ట్రైనీ డాక్టర్ హత్యాచారం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment