Telangana: తెలంగాణ కొత్త స్పీకర్ ఎవరు? స్పీకర్ పదవి వద్దే వద్దంటున్న సీనియర్లు! తెలంగాణ సీఎం పదవి కోసం పోటీ పడ్డారు.. మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు.. కానీ, స్పీకర్ పదవంటే చాలు భయపడిపోతున్నారు కాంగ్రెస్ నేతలు. స్పీకర్ పదవి మాకొద్దంటే మాకొద్దు అని వెనక్కి వెళ్తున్నారు. అయితే, తుమ్మల నాగేశ్వరరావుకే స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. By Shiva.K 06 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Assembly New Speaker: తెలంగాణ సీఎం ఎవరనేది తేలిపోయింది.. మంత్రులు కూడా దాదాపు ఖరారయ్యారు. అయితే, మంత్రుల కంటే ముందు స్పీకర్ ఎవరు అనేది తేలాల్సి ఉంది. స్పీకర్ పదవి ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదట కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు. సీనియర్ నేతలంతా తమకు స్పీకర్ పదవి వద్దంటే వద్దు అని దూరం జరుగుతున్నారట. స్పీకర్‌గా పని చేస్తే మళ్లీ గెలవరనే ఒక విశ్వాసం రాజకీయ నేతల్లో గాఢంగా ఉంది. గతంలో స్పీకర్‌గా పని చేసిన వారంతా ఓడిపోయారే తప్ప.. ఎన్నడూ గెలిచిన దాఖలాలు లేవు. అయితే, పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఆ మూఢ నమ్మకాన్ని బ్రేక్ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఏది ఏమైనా.. స్పీకర్‌గా చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పోచారం గెలుపును ఉదాహరణగా చూపించినా.. మాకు వద్దే వద్దంటున్నారు నేతలు. స్పీకర్ పదవి ప్రచారంలో తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు బలంగా వినిపిస్తోంది. అయితే, శ్రీధర్ బాబు, రాజనర్సింహ తమకు స్పీకర్ వద్దంటే వద్దు అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. అయితే, ఖమ్మం జిల్లాలో మంత్రి పదవులు దక్కి వారి లిస్ట్‌లో భట్టి విక్రమార్క, కూనంనేని సాంబశివరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండటంతో.. తుమ్మల నాగేశ్వరరావుకే స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్‌లో కాంగ్రెస్ గెలుపొంది.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరనే అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం తేల్చేసింది. మంత్రులు పేర్లను కూడా దాదాపు ఫైనల్ చేసింది. గురువారం నాడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, స్పీకర్ పదవి విషయంలోనే తేడా వస్తోంది. ఈ పదవిని స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఏం చేయాలని ఆలోచనలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. మరి చివరకు ఆ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి. Also Read: ఆ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి..! హమ్మయ్య.. రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే.. #cm-revanth-reddy #telangana-assembly #congress-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి