TS Govt Jobs 2023: తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!!

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‎స్టిట్యూషన్స్ సొసైటీ గెస్ట్ అధ్యాపకుల కోసం సిరిసిల్లలోని టీటీడబ్య్లూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

New Update
TS Govt Jobs 2023: తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!!

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‎స్టిట్యూషన్స్ సొసైటీ గెస్ట్ అధ్యాపకుల కోసం సిరిసిల్లలోని టీటీడబ్య్లూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

పోస్టులు :

-ఫ్యాషన్ డిజైన్
-ఇంటీరియర్ డిజైన్
-ఫొటోగ్రఫీ
-కంప్యూటర్ సైన్స్

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఆన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 10-2023. పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ చెక్ చేసుకోవచ్చు. https://www.ttwrdcs.ac.in/

ఇది కూడా చదవండి: టెన్త్ పాసైన వారికి శుభవార్త.. ఎల్ఐసీ నుంచి రూ.30 వేల స్కాలర్షిప్.. దరఖాస్తు ఇలా..!!

కాగా అటు గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలకు హాజరైన అభ్యర్థులను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ( TREIPB)అలర్ట్ చేసింది. సొసైటీ , జోనల్ ప్రాధాన్యతలను స్వీకరిస్తోంది. ఇలా చేయకపోతే మీ అప్లికేషన్ రిజక్ట్ అవుతుందని బోర్డు తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://treirb.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చేందుకు బోర్డు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇచ్చే ఆప్షన్లు తుది ఆప్షన్ గా పరిగణిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు గురుకుల బోర్డు అధికారులు సెప్టెంబర్ 20న ఈ ప్రకటన విడుదల చేశారు.

ఒక్కసారి మాత్రమే ఛాన్స్…జాగ్రత్తగా ఆప్షన్స్ సెలక్ట్ చేసుకోవాలి:
గురుకుల బోర్డు నిర్దేశించిన ప్రకారం అర్హత పరీక్షలు రాసిన అభ్యర్థులు మాత్రమే ఆప్షన్స్ సమర్పించే ఛాన్స్ ఉంటుంది. బోర్డు నిర్దేశించిన తేదీల్లో ఆయనా పోస్టులకు మంజూరైన అభ్యర్థులు ముందుగా సొసైటీ ఆప్షన్స్ సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. అభ్యర్థులు సమర్పించే సొసైటీ ఆప్షన్ల వారీగా ప్రాధాన్యత ప్రకారం ఆయా సొసైటీల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. అదేవిధంా జోనల ప్రాధాన్యతలకు కూడా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో జోన్ల ఆప్షన్ కు అనుగుణంగా అభ్యర్థులకు ఆయా జోన్లలో పోస్టింగ్ ఇవ్వనున్నట్ల గురుకుల బోర్డు తెలిపింది. కాగా సొసైటీలు, జోన్ల ఆప్షన్స్ సెలక్షన్ కేవలం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఒకసారి సెలక్ట్ చేసుకన్న తర్వాత వాటిని మళ్లీ సవరించేందుకు ఎలాంటి అవకాశం ఉండదని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అత్యంత జాగ్రత్తగా ఆప్షన్స్ సమర్పించాలని గురుకులాల బోర్డు తెలిపింది.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 వేల జాబ్స్ పై కీలక అప్డేట్..!!

ఆప్షన్స్ ఇవ్వాల్సిన ముఖ్యమైన తేదీలివే:
-సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు – ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ( TGT) పోస్టులకు ఆప్షన్స్ ఇవ్వాలి.
-అక్టోబర్ 3 నుంచి 9 వరకు – పాఠశాలల్లోని లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ డ్రాయింగ్, ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ టీచర్లు ఆప్షన్స్ ఇవ్వాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు