Suryapet: ఆరుగురు దొంగలు అరెస్ట్.. రూ. 30 లక్షలు విలువ చేసే..

సూర్యాపేట జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 30 లక్షలు విలువ చేసే 35.4 తులాల బంగారు, 10 తులాల సిల్వర్ ఆభరణాలు, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

New Update
Suryapet: ఆరుగురు దొంగలు అరెస్ట్.. రూ. 30 లక్షలు విలువ చేసే..

Suryapet: ఒంటరిగా నిద్రిస్తున్న మహిళ ఒంటిపై నుండి అభరణాలు దొంగిలించిన దొంగను, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న స్త్రీ, పురుషుల జంటలను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వీరితో పాటు తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనం చేస్తున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..!

సూర్యాపేట జిల్లాలో మొత్తం ఆరుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా పొలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను మునగాల, హుజూర్నగర్, చివ్వేంలలో అరెస్ట్ చేసినట్లు వివరించారు.

Also Read: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం.. టీడీపీ నాయకుల వార్నింగ్..!

నిందితుల నుండి రూ. 30 లక్షలు విలువ చేసే 35.4 తులాల బంగారు, 10 తులాల సిల్వర్ ఆభరణాలు, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను రిమాండ్ కు పంపించామన్నారు. చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుకు సంబంధించి ఓ నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. త్వరలో అతనిని కూడా పట్టుకుంటామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు