వచ్చే ఏడాది మొత్తం 27 సెలవులు.. లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవ‌త్సరానికి సంబంధించి సెల‌వుల జాబితాను విడుదలచేసింది. మొత్తం 2024లో సాధార‌ణ సెల‌వులు 27, ఆఫ్షనల్ హాలీడేస్ 25 కలిపి 52 ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
వచ్చే ఏడాది మొత్తం 27 సెలవులు.. లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్!

Telangana Holidays 2024: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవ‌త్సరానికి సంబంధించి సెల‌వుల జాబితాను విడుదలచేసింది. మొత్తం 2024లో సాధార‌ణ సెల‌వులు 27, ఆప్షనల్ హాలీడేస్ 25 కలిపి 52 ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి (Shanti Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది.

Telangana Holidays 2024

పబ్లిక్ హాలీడేస్ 2024 :
జనవరి 1, జనవరి 14 (భోగీ), జనవరి 15 (సంక్రాంతి), జనవరి 26 (రిపబ్లిక్ డే), మార్చి 8 (మహాశివరాత్రి), మార్చి 25 (హోలీ), మార్చి 29 (గుడ్ ఫ్రైడే), ఏప్రిల్ 5 (బాబూ జగ్జీవన్‌రాం జయంతి), ఏప్రిల్ 9 (ఉగాది) , ఏప్రిల్ 11, 12 (రంజాన్), ఏప్రిల్ 14 (అంబేద్కర్ జయంతి), ఏప్రిల్ 17 (శ్రీరామనవమి), జూన్ 17 (బక్రీద్), జూలై 17 (మొహర్రం), జూలై 29 (బోనాలు), ఆగస్ట్ 15 (ఇండిపెండెన్స్ డే), 26 (శ్రీకృష్ణాష్టమి), సెప్టెంబర్ 7 (వినాయక చవితి), సెప్టెంబర్ 16 (ఈద్ మిలాద్ ఉన్ నబీ), అక్టోబర్ 2 (గాంధీ జయంతి), అక్టోబర్ 12, 13 (విజయదశమి), అక్టోబర్ 24 (దీపావళి), నవంబర్ 25 (గురునానక్ జయంతి), డిసెంబర్ 25, 26 (క్రిస్మస్)

Telangana Holidays 2024

ఆప్షనల్ హాలీడేస్ 2024 :
జనవరి 16 (కనుమ), జనవరి 25 (హజ్రత్ అలీ బర్త్ డే), ఫిబ్రవరి 8 (షబ్ ఈ మిరాజ్), ఫిబ్రవరి 14 (శ్రీ పంచమి), ఫిబ్రవరి 26 (షబ్ ఈ బరత్), మార్చి 31 (షహదత్ హజత్ అలీ), ఏప్రిల్ 7 (షబ్ ఈ ఖదర్), ఏప్రిల్ 14 (తమిళ్ న్యూ ఇయర్స్ డే), ఏప్రిల్ 21 (మహావీర్ జయంతి), మే 10 (బసవ జయంతి), మే 23 (బుద్ధ పూర్ణిమ), జూన్ 25 (ఈద్ ఇ ఘదీర్), జూలై 7 (రత్నయాత్ర), జూలై 16 (మొహర్రం), ఆగస్టు 16 (వరలక్ష్మీ వ్రతం), ఆగస్టు 19 (శ్రావణ పూర్ణిమ) , అక్టోబర్ 10 (దుర్గాష్టమి), అక్టోబర్ 11 (మహార్నవమి), అక్టోబర్ 30 (నరక చతుర్ది), నవంబర్ 16 (సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహదీ జయంతి)

Also Read: చంద్రయాన్ 3 ఈ సంవత్సరం గూగుల్ టాప్ సెర్చ్.. నెటిజన్లను ఆకర్షించిన చందమామ!

Advertisment
Advertisment
తాజా కథనాలు