Indra : తగ్గని మెగాస్టార్ క్రేజ్.. ఇంద్ర రీరిలీజ్ కు ఆర్టీసీ స్పెషల్ బస్సులు! మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకి రీ రిలీజ్ అయిన 'ఇంద్ర' మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో ఓ ఊపు ఊపుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ట్వీట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇంద్ర మూవీని చూసేందుకు వెళ్లే వారి కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. By Anil Kumar 23 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Indra Movie Re-Release : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బర్త్ డే (Birthday) సందర్భంగా రీ రిలీజ్ అయిన 'ఇంద్ర' (Indra) మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో ఓ ఊపు ఊపుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఈ మూవీ మేనియా ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా మూవీ లవర్స్ అంతా ఈ మూవీని థియేటర్స్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ చిరు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని 'ఇంద్ర' ద్వారా మరోసారి నిరూపితం అయింది. తాజాగా ఈ మూవీ మేనియాపై తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ట్వీట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇంద్ర మూవీని చూసేందుకు వెళ్లే వారి కోసం స్పెషల్ గా బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ అంతా ప్రత్యేకంగా బస్సులు, లారీలల్లో భారీ సంఖ్యలో చూసేందుకు వెళ్ళేవాళ్ళు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయ్యేది. Take a TGSRTC bus for a hassle-free ride and join the #INDRA re-release mania at your nearest theatre ✨#TGSRTC #Telangana #Hyderabad #PublicTransport #TGSRTCGamyamApp #TakingTelanganaForward pic.twitter.com/zGyAk9WvXM — TGSRTC (@TGSRTCHQ) August 23, 2024 Also Read : తేజ సజ్జా బర్త్ డే స్పెషల్.. ‘మిరాయ్’ న్యూ పోస్టర్ అదిరింది తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ కు ఆ రేంజ్ లో క్రేజ్ ఉండేది. ఇప్పటికీ అదే క్రేజ్ మైంటైన్ అవుతుంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఆయన సినిమా రీ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిందంటే చిరు క్రేజ్ కు ఇంతకు మించిన నిదర్శనం మరొక్కటి లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. #megastar-chiranjeevi #tgsrtc #indra-movie #happy-birthday-megastar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి