BRS MLA Mallareddy: నేనే హోంమంత్రి.. మల్లారెడ్డి సంచలన కామెంట్స్! బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే తాను హోంమంత్రిని అయ్యేవాడినన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. తమ పార్టీ అధికారంలోకి వస్తే తన లెవల్ వేరేగా ఉండేదన్నారు. ఇంకా ఏడాదికి నాలుగు సినిమాలు కూడా తీసేవాడినన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By Nikhil 30 Jul 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో సారి చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. బీఆర్‌ఎస్ ముచ్చటగా మూడోసారి గెలిస్తే తాను వేరే లెవల్ లో ఉండేవాడినంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను హోం మినిస్టర్ ను అయ్యేవాడినన్నారు. దీంతో పాటు ఏడాదికి నాలుగు సినిమాలు తీసే వాడినన్నారు. కొత్త శాటిలైట్ ఛానల్ కూడా పెట్టేవాడిన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో హెం మంత్రి పదవి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉందన్నారు. ఇది కూడా చదవండి: TG Politics: బీఆర్ఎస్ గూటికి మరో ఎమ్మెల్యే.. రేవంత్ రెడ్డికి రెండో షాక్? దేశంలో విద్యాసంస్థల నిర్వహణలో తానే నంబర్.1 అంటూ చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. అసెంబ్లీలోనూ తాను పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదన్నారు మల్లారెడ్డి. అధికార పక్షం వారు కూడా తనను రెచ్చగొట్టడం లేదన్నారు. అందుకే సైలెంట్ గా ఉంటున్నానన్నారు. తనపై ఎవరైనా కామంట్ చేస్తే ధీటైనా సమాధానం చెప్పడానికి సిద్ధం అన్నారు మల్లారెడ్డి. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు చాలా చక్కగా మాట్లాడుతున్నారన్నారు. యువ సభ్యుల సంఖ్య శాసనసభలో పెరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవల తన నివాసంపై జరిగిన ఐటీ దాడుల్లో ఏమీ దొరకలేదన్నారు. దీంతో ఆ అధికారులే షాక్ కు గురయ్యారని చెప్పారు. బీఆర్ఎస్ ను వీడి వెళ్లి పోయిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో సంతోషంగా లేరన్నారు. వారంతా తిరిగి వాస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: BIG BREAKING: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి