Telangana Police: తెలంగాణలో రెయిన్ అలర్ట్.. వాహనదారులకు పోలీసుల కీలక సూచన!

వర్షాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు. వేగంతో వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లవద్దన్నారు. హెల్మెట్/సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. చెట్ల కింద నిల్చోవద్దన్నారు.

New Update
Telangana Police: తెలంగాణలో రెయిన్ అలర్ట్.. వాహనదారులకు పోలీసుల కీలక సూచన!

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు.

  • వాహనదారులు అతివేగంతో వెళ్లవద్దని సూచించారు. వేగంతో వెళ్తే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పరిమిత వేగంతో వాహనాలను నడపాలని సూచించారు.
  • వాహనదారులు విధిగా హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించాలన్నారు.
  • వాహనం సరైన కండిషన్లో ఉండేలా చూసుకోవాలన్నారు.
  • అధిక వర్ష సమయంలో డ్రైనేజీలు పొంగుపొర్లుతున్నట్లు గమనిస్తే.. అటువైపు వెళ్లొద్దన్నారు.

  • వర్షం కురిసేటప్పుడు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లొద్దన్నారు.
  • వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద కూర్చోవద్దన్నారు. వర్షాలకు చెట్లు కూలే ప్రమాదం ఉందన్నారు.
    అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్ కు డయల్ చేయాలని సూచించారు
  • నిరంతరం ప్రజలకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఉంటారని.. వారి సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు.



Advertisment
Advertisment
తాజా కథనాలు