Viral News: బీభత్సం సృష్టించిన యూట్యూబర్‌.. షాకిచ్చిన పోలీసులు..!

హైదరాబాద్‌ - కూకట్‌పల్లి ప్రాంతంలో రోడ్లపై డబ్బులు విసిరేసి బీభత్సం సృష్టిస్తూ రీల్స్ చేసిన హర్షకు పోలీసులు షాక్ ఇచ్చారు. సనత్ నగర్ పీఎస్ లో ఆయనపై కేసు నమోదు చేశారు. డబ్బుల కోసం స్థానికులు ఎగబడడం, ట్రాఫిక్ కు అంతరాయం కలగడం, న్యూసెన్స్ సృష్టించడంపై చర్యలు తీసుకున్నారు.

New Update
Viral News:  బీభత్సం సృష్టించిన యూట్యూబర్‌.. షాకిచ్చిన పోలీసులు..!

Youtuber Harsha: యువతకు రీల్స్ పిచ్చి రోజురోజుకి ముదిరిపోతోంది. లైకుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రోడ్లపై విచ్చలవిడిగా విన్యాసాలు చేస్తున్నారు. రీసెంట్ గా  ఓ యువకుడు హైదరాబాద్‌ - కూకట్‌పల్లి ప్రాంతంలో రోడ్లపై డబ్బులు విసురుతూ రీల్స్ చేశాడు. పవర్ హర్ష అలియాస్ మహదేవ్ అనే యువకుడు యూట్యూబర్ & ఇన్‌స్టాగ్రామర్.

Also Read: ఫార్మా బాధితులను పరామర్శించిన జగన్.. మా హయాంలోనే ఎక్కువ ప్రమాదాలు అంటూ..

రెండు రోజుల క్రితం రోడ్లపై డబ్బులు విసిరేస్తూ స్టంట్స్ చేశాడు. డబ్బుల కోసం స్థానికులు రోడ్లపై ఎగబడడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు హర్షపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అతడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

తాజాగా, యూట్యూబర్‌ హర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బులు విసిరేస్తూ రోడ్లపై హల్‌చల్‌ చేశాడని.. ట్రాఫిక్‌ కు ఇబ్బంది కలిగించాడని సనత్‌నగర్‌ పోలీస్ స్టేషన్లో ‌ట్రాఫిక్‌ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో హర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేపీహెచ్‌బీలో కూడా హర్షపై మరో కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియా వీడియోల కోసం, రీల్స్ కోసం, సమాజానికి ఇబ్బంది కలిగేలా ఇలాంటి దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే… కఠినమైన కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయని.. తస్మాత్ జాగ్రత్త అంటూ తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు