Radhakrishnan : తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం తెలంగాణకు కొత్త గవర్నర్ గా నియమితులైన రాధాకృష్ణన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్ట్ న్యాయమూర్తి అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ హాజరయ్యారు. By Trinath 20 Mar 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Governor : ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్(Telangana Governor) గా బాధ్యతలు నిర్వర్తించిన తమిళిసై(Tamilisai) ఇటీవల రాజీనామా చేశారు. ఆమె తమిళనాడు(Tamilnadu) నుంచి పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేశారని తెలుస్తోంది. నూతన తెలంగాణ గవర్నర్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాధాకృష్ణన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే.. రాధాకృష్ణన్(Radhakrishnan) రెండుసార్లు 1998, 1999లో లోక్ సభ(Lok Sabha) కు ఎన్నికయ్యారు. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో పెరిగారు. 1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణన్ బీజేపీలో సీనియర్ నేతగా ఎదిగారు. తమిళనాడులో బీజేపీ(BJP) బలపడేందుకు ఎన్నో పోరాటాలు చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఆయన పని చేశారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా..2016 నుంచి 2019 వరకు కోయిర్ బోర్డ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. Also Read : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ 2023 ఫిబ్రవరి నుంచి జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్ పని చేశారు. ఇటీవల తమిళిసై రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్ గా కేంద్రం ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అయితే.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ గవర్నర్ గా నియమితులైన నరసింహన్, తమిళిసై, రాధాకృష్ణన్ ముగ్గురూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే కావడం విశేషం. #cm-revanth-reddy #telangana-governor #radhakrishnan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి