MLC ELECTIONS: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఈ నెల 11న నోటిఫికేషన్, 29న పోలింగ్ జరగనుంది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు.

New Update
MLC ELECTIONS: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

Telangana MLC Elections Notification: తెలంగాణలో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి. స్టేషన్‌ ఘన్‌పూర్ నుంచి కడియం, హుజురాబాద్ నుంకి కౌశిక్ రెడ్డి గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాదించడడంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొన్ని రోజులుగా ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఆ రెండు స్థానాలపై కసరత్తు చేసింది ఎన్నికల కమిషన్. రెండు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. రెండు స్థానాల్లో ఈ నెల 29న ఎన్నిక నిర్వహించనుంది.
ఇది కూడా చదవండి: Loksabha Elections 2024: బీజేపీ జహీరాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి? రేసులో చీకోటి ప్రవీణ్, రచనారెడ్డితో పాటు..!

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్..

* ఈ నెల 11న నోటిఫికేషన్.
* నామినేషన్ల స్వీకరణ గడువు: జనవరి 18
* నామినేషన్ల పరిశీలన: జనవరి 19
* అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: జనవరి 22
* పోలింగ్ తేదీ: 29 జనవరి
* పోలింగ్ సమయం: 22వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
* పోలింగ్ ఫలితాలు: 29 జనవరి రోజునే.

ఆ స్థానాల్లో గెలుపు ఎవరిది? 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. హుజురాబాద్ లో బీజేపీ నేత ఈటల రాజేందర్ ను పాడి కౌశిక్ రెడ్డి ఓడించి.. అక్కడ గులాబీ జెండా ఎగరవేశారు. ఎమ్మెల్సీగా కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ లో ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు ఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 29 పోలింగ్ జరగనుంది.

ఈ రెండు సీట్లు ఇప్పుడు ఎవరు కైవసం చేసుకుంటారనే చర్చ మొదలైంది. అయితే, ప్రస్తుతం ఆ రెండు స్థానాల్లో ఇరు పార్టీల నుంచి ఎవరిని నిలబెడుతారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు