KTR Press Meet: లోకేష్ ఫోన్ చేశారు.. చంద్రబాబు అరెస్ట్‌తో మాకేం సంబంధం: కేటీఆర్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌తో మాకేం సంబంధం అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు చేస్తే ఏపీలో చేయాలి కానీ.. తెలంగాణలో చేయడం ఏంటని ప్రశ్నించారు.

New Update
KTR Press Meet: లోకేష్ ఫోన్ చేశారు.. చంద్రబాబు అరెస్ట్‌తో మాకేం సంబంధం: కేటీఆర్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌తో (Chandrababu Arrest) మాకేం సంబంధం అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (Minister KTR) సంచలన వాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు చేస్తే ఏపీలో చేయాలి కానీ.. తెలంగాణలో చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎవరైనా పోటీ ర్యాలీలు చేస్తే తాము ఏం చేయాలని ప్రశ్నించారు. లోకేష్‌ ఫోన్‌ చేసి ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదంటని అడిగారని చెప్పారు కేటీఆర్. ఫ్రెండ్‌ ద్వారా ఫోన్‌ చేయించారన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పక్కింట్లో పంచాయితీని ఇక్కడ తేల్చుకోవడం ఏంటని చంద్రబాబు అరెస్టును ఉద్ధేశించి వాఖ్యానించారు.

ఈ విషయమై రాజమండ్రి, విజయవాడ, అమరావతిలో తేల్చుకోవాలని సూచించారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలకు తెలంగాణలో ఉనికి లేదన్నారు. చంద్రబాబు తనపై కేసుల విషయంలో న్యాయపోరాటం చేస్తున్నారని.. ఈ విషయమై కోర్టుల్లోనే ఏదో ఒకటి తేలుతుందన్నారు. తనకు లోకేష్‌, జగన్‌, పవన్‌ ముగ్గురూ ఫ్రెండ్సే అని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. తనకు ఏపీతో ఎలాంటి పంచాయితీ లేదని స్పష్టం చేశారు కేటీఆర్.

అలాంటిది తమకెందుకు వాళ్లతో పంచాయితీలు పెడతారని ప్రశ్నించారు. తమనేతలు ఎవరైనా చంద్రబాబు కేసు విషయమై మాట్లాడి ఉంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనని తేల్చి చెప్పారు. తాను చెప్పింది మాత్రమే పార్టీ పరంగా తీసుకున్న స్టాండ్‌ అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగుండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టడం సరికాదన్నరు కేటీఆర్.

దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ మోదీ ఎజెండాగా పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్‌ అయ్యే ఒక్కరోజు ముందు కూడా తమిళిసై బీజేపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలిగా పని చేశారన్నారు. తమిళిసైని గవర్నర్ గా నియమించడం సర్కారియా కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి:
Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

Advertisment
Advertisment
తాజా కథనాలు