TS Inter Exams 2024: ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే! తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. సెకండియర్ ఎగ్జామ్స్ 29 నుంచి ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. By Nikhil 28 Dec 2023 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TS Inter Exams Schedule 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభమై.. మార్చి 13న ముగియనున్నాయి. సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 14 వరకు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్ పరీక్షల తేదీలు: - ఫిబ్రవరి 28: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1. -మార్చి 1: ఇంగ్లీష్ పేపర్ 1 -మార్చి 4: మాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1 -మార్చి 6: మాథ్స్ పేపర్ 1b/ జువాలజి పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1 -మార్చి 11: ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1 -మార్చి 13: కెమిస్ట్రీ పేపర్ 1/ కామర్స్ పేపర్ 1 సెకండియర్ పరీక్షల తేదీలు: -ఫిబ్రవరి 29: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 -మార్చి 2: ఇంగ్లీష్ పేపర్ 2 -మార్చి 5: మాథ్స్ పేపర్ 2A/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2 -మార్చి 7: మాథ్స్ పేపర్ 2B/ జువాలాజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2 -మార్చి 12: ఫిజిక్స్ పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2 -మార్చి 14: కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2 ఇంటర్ పరీక్షల తేదీలు విడుదలైన నేపథ్యంలో మరో ఒకటి లేదా రెండు రోజుల్లో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. #exams #ts-inter-exams-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి