Street Dogs in Hyd: వీధి కుక్కల దాడులు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ వివిధ ప్రాంతాల్లో వీధి కుక్కల వరుస దాడులపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. By Nikhil 18 Jul 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి తెలంగాణలో.. ఇందులో ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఇటీవల వీధి కుక్కల దాడులు అధికమయ్యాయి. ఇస్నాపూర్ లో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి ఘటన మరవక ముందే.. జవహర్ నగర్ లో మరో చిన్నారి వీధి కుక్కల దాడికి బలయ్యాడు. రాష్ట్రంలో ప్రతీ రోజు సగటున 70 మంది కుక్కకాటుకు గురవుతున్నారు. ఏడు నెలల్లో 15 మంది వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా సంస్థల లెక్కలు చెబుతున్నాయి. నిత్యం వీధి కుక్కల దాడులకు సంబంధించి వార్తలు వస్తుండడంతో హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా.. వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ తెలిపారు. కుక్కల దాడి ఘటనలు నివారించేందుకు స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ లో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని వివరించారు. ఒక్కో కేంద్రం వద్ద సుమారు రోజుకు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే.. స్టెరిలైజేషన్ ద్వారా ఎలా దాడి ఘటనలను ఆపుతారని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. షెల్టర్ హోమ్స్ కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది వివరించారు. నాగపూర్ లో దాదాపు 90 వేల కుక్కలను షెల్టర్ హోమ్ లో పెట్టినట్లు కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి