Telangana : తెలంగాణ స్కూల్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. దసరా సెలవులు ఎన్ని రోజులంటే?

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 227 రోజుల పాటు పని చేయనున్నాయి.

New Update
telangana

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 227 రోజుల పాటు పని చేయనున్నాయి. 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2027 ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మొత్తం 13 రోజుల పాటు

ఈ కొత్త అకడమిక్ క్యాలెండర్‌లో పండుగ సెలవుల వివరాలను కూడా వెల్లడించారు. విద్యార్థులకు ఎంతో ఇష్టమైన దసరా సెలవులను 2026 అక్టోబర్ 10వ తేదీ నుండి అక్టోబర్ 22వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు ప్రకటించారు. అలాగే, సంక్రాంతి పండుగ సెలవులను 2027 జనవరి 13వ తేదీ నుండి జనవరి 17వ తేదీ వరకు మొత్తం 5 రోజుల పాటు ఇవ్వనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో చివరి పని దినం 2027 ఏప్రిల్ 23 కాగా, ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 24వ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి.

పాఠశాలల పని వేళల విషయానికి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హైస్కూళ్లు, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 04:15 గంటల వరకు నడుస్తాయి. అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడి హైస్కూళ్లు, అప్పర్ ప్రైమరీ పాఠశాలల వేళలను ఉదయం 08:45 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు కేటాయించారు. అలాగే, సాధారణ ప్రైమరీ స్కూళ్లు (1 నుండి 5 తరగతులు) ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు, జంట నగరాల్లోని ప్రైమరీ స్కూళ్లు ఉదయం 08:45 నుండి సాయంత్రం 03:45 గంటల వరకు కొనసాగుతాయి.

Advertisment
తాజా కథనాలు