Telangana : రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి..!

రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రుణమాఫీ మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల పేరిట రుణాలు ఎంత ఉన్నా.. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలి ప్రభుత్వం నిర్ణయించుకుంది.

New Update
Telangana : రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి..!

Crop Loan Waiver Scheme : రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) పై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రైతు రుణమాఫీ మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana) మార్గదర్శకాలు అమలు చేసే అవకాశం ఉంది. కుటుంబ యూనిట్‌ వారిగా రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో వారి పేరిటి రుణాలు ఎంత ఉన్నా.. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రేషన్‌కార్డు, వ్యవసాయ శాఖ వద్ద ఉన్న డేటా ఆధారంగా రుణమాఫీ జరగనుంది.

Also Read: సముద్ర గర్భంలో రామసేతు నిజమే: ఇస్రో!

దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలైన వెంటనే రైతు జాబితా తయారీ అవుతుంది. బ్యాంకు అధికారులతో కలిసి రైతు జాబితా తయారు చేయనున్నారు. చివరగా గ్రామ సభలో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటారు. గతంలో అనుసరించిన పద్ధతిలోనే అమలు చేయనున్నారు. రుణమాఫీ..రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేయాలా..? వద్దా..? అనే దానిపై పరిశీలన జరుగుతోంది. అలాగే పంటల కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు సైతం మాఫీకి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Also Read: కేఫ్‌ లో భారీ పేలుడు.. 20 మంది మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mudragada Padmanabham: జగన్ కు ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా జగన్ నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ముద్రగడ జగన్ కు లేఖ రాశారు. PACలో చోటు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు త్రికణశుద్ధిగా పని చేస్తానన్నారు.

New Update
Mudragada Padmanabham YS Jagan

Mudragada Padmanabham YS Jagan

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ మాజీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు త్రికరణశుద్ధిగా కష్టపడతానని లేఖలో పేర్కొన్నారు. పేదవారికి మీరే ఆక్సిజన్ అంటూ కొనియాడారు. ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పది కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. 

Also Read :  ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే.. ప్రూఫ్స్ ఇవే.. హర్షకుమార్ సంచలన వీడియో!

Also Read :  సజ్జలే నంబర్-2.. ఆయన చెప్పిందే ఫైనల్.. జగన్ సంచలన నిర్ణయం!

Mudragada Padmanabham Letter To YS Jagan

Also Read :  తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

Also Read :  రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !

 

mudragada padmanabham | ys-jagan | andhra-pradesh-news | andhra-pradesh-politics | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment