TS Six Guaranties Applications: 6 గ్యారంటీల అప్లికేషన్‌ ఇలా నింపండి.. తప్పక నమోదు చేయాల్సిన వివరాలివే!

తెలంగాణలో ఆరు గ్యాంరెటీలకు సంబంధించిన అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుదారులు ముందుగా తమ కుటుంబ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం వారికి వర్తించే పథకాల కింద.. సూచించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

New Update
TS Six Guaranties Applications: 6 గ్యారంటీల అప్లికేషన్‌ ఇలా నింపండి.. తప్పక నమోదు చేయాల్సిన వివరాలివే!

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈ రోజు నుంచి ఆరు గ్యాంరెటీల అమలుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు లబ్ధిదారులు బారులు దీరుతున్నారు. అయితే ఈ ఫామ్ ను ఎలా నింపాలో తెలియక అనేక మంది అయోమయానికి గురవుతున్నారు. అయితే.. ఫామ్ ను చాలా సులభంగా నింపొచ్చు. ఫామ్ నింపడానికి ముందు ఈ కింది వివరాలు తెలుసుకోండి.

అయితే.. ఫామ్ లో మొదటగా కుటుంబ వివరాలు నింపాల్సి ఉంటుంది. ముందుగా ఇంటి యజమాని పేరు రాయాలి. తర్వాత స్త్రీ, పురుషుడు, ఇతరులు ఆప్షన్ల ముందు ఇచ్చిన బాక్స్ లో టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులలో మీకు సంబంధించిన కేటగిరీ ముందు కూడా టిక్ చేయాలి. తర్వాత పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, రేషన్ కార్డు నంబరు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. తర్వాత మీ వృత్తి రాయాలి. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలను రాయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Vijayakanth Life: తుపానుల మధ్య పిడుగు.. విజయకాంత్ అంటే అంతే మరి!

ఏ పథకం కోసం ఏయే వివరాలివ్వాలో తెలుసుకోండి
మహాలక్ష్మి పథకం: ఈ స్కీమ్ కింద నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం పొందలనుకున్న వారు ఆ కేటగిరీలో టిక్‌ చేయాల్సి ఉంటుంది. రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌ కోసం గ్యాస్‌ కనెక్షన్‌ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ, సంవత్సరానికి వినియోగించే సిలెండర్ల సంఖ్యను దరఖాస్తు ఫామ్ లో నమోదు చేయాల్సి ఉంటుందని
రైతు భరోసా పథకం: ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారు సాగు రైతా లేక కౌలు రైతా? అన్న వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. సాగు రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్‌ నంబర్‌ ను నమోదు చేయాల్సి ఉంటుంది. కౌలు రైతులు తాము కౌలు చేస్తున్న భూమి వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. వ్యవసాయ కూలీలు తమ ఉపాధి హామీ కార్డు నంబర్‌ ను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఇందిరమ్మ ఇండ్ల పథకం: ఇంటి నిర్మాణ ఆర్థిక సాయం కోసం అని రాసి ఉన్న చోట టిక్‌ చేయాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు 250 గజాల ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేయడానికి.. అమరవీరుడి పేరు, అమరుడైన సంవత్సరం, ఎఫ్‌ఐఆర్‌ నంబర్, డెత్‌ సర్టిఫికేట్ నంబర్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులు కేసులు, జైలుకు వెళ్లన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

గృహజ్యోతి స్కీమ్: ఈ కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పొందడానికి.. విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ నంబర్‌ ను అప్లికేషన్ ఫామ్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.
చేయూత స్కీమ్: కింద వృద్ధులు నెలకు రూ.4 వేలు, దివ్యాంగులు నెలకు రూ.6 వేల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ నంబర్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్‌ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టేకేదారు జీవన భృతికి సంబంధించి ఆయా ఆప్షన్ల ముందు టిక్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలుంటే కేంద్రాల వద్ద అధికారులను సంప్రదించవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు