GADDAR JAYANTHI : అధికారికంగా ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌లు

ప్రజా యుద్దనౌక గద్దర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది..ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసారు.జనవరి 31న ఈ వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహిస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

New Update
GADDAR JAYANTHI : అధికారికంగా ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌లు

GADDAR JAYANTHI TODAY :  ఉద్యమకారుడిగా, మహా విప్లవ కవిగా తన జీవితాన్ని బడుగు బలహీనవర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్(Gaddar). తుది శ్వాశ వరకు అణగారిన వర్గాల కోసమే పాటుపడి, తన పాట(Song) తో  జనం గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయిన  ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌ల‌ను అధికారికంగా నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుందని  ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు. సీయం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వం జీవో కూడా విడుదల చేసింద‌ని, నేడు (బుధ‌వారం)  ర‌వీంద్ర భార‌తీ(Ravindra Bharathi)లో గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. స‌మాజంలో ఉన్న అంత‌రాలు తొల‌గించాల‌ని త‌న జీవితాంతం ప‌రిత‌పించి, త‌న గ‌ళంతో జనాలలో చైతన్య స్ఫూర్తిని రగిలించారని ఈ సంద‌ర్భంగా గ‌ద్ద‌ర్ సేవ‌లను గుర్తు చేశారు.

గద్దర్ కుమార్తెకు మాట ఇచ్చి నిలబెట్టుకున్న మంత్రి పొన్నం 

జనవరి 31 గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని గద్దర్ కుమార్తె వెన్నెల మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తో భేటీ అయి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.అయితే..ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చిన పొన్నం అనుకున్నట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం.. గద్దర్ జయంతి ఉత్సవాలను  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Government Of Telangana

తెల్లాపూర్ లో విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ 

బడుగు వర్గాల ఆశాజ్యోతి.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఏర్పడిన వివాదానికి తెరపడింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో ఇటీవల అఖిలపక్షం నాయకులు ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు  చేసే౦దుకు  సన్నాహాలు చేస్తుండగా గద్దర్‌ వ్యతిరేక వ్యక్తులు,హెచ్‌ఎండీఏ అధికారులు, పోలీసులు ఆ పనులు జరుగకుండా అడ్డుకున్నారు.  దీంతో విగ్రహ ఏర్పాటు నిలిచిపోవడంతో పలు సంఘాలు ఆందోళన చేపట్టడం కూడా జరిగింది. ఈ క్రమంలో  ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్(Congress Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించి స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31 గద్దర్ జయంతిని పురస్కరించుకుని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంఘాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ALSO RAED: గద్దర్ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Advertisment
Advertisment
తాజా కథనాలు