Mega Dsc: వారం రోజుల్లో తెలంగాణలో మెగా డీఎస్సీ?

కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వారం రోజుల్లో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం.

New Update
Breaking : టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

Telangana Mega Dsc Notification: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వారం రోజుల్లో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం.

ALSO READ: గొర్రెల పంపిణీలో స్కాం.. నలుగురు అధికారులు అరెస్ట్!

సింగరేణిలోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..

సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల‌ను భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేష‌న్లు సిద్ధం చేయాల‌ని రాష్ట్ర సింగరేణి ఛైర్మన్ అండ్‌ ఎం.డీ బలరామ్ నాయ‌క్ ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల‌న్నారు.

563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్..

గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచింది రేవంత్‌ సర్కార్‌. మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉండే అవకాశముంది. అలాగే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్ష ఉండనున్నట్లు తెలుస్తుంది. గతంలో గ్రూప్‌-1 కు అప్లై చేసుకున్నవాళ్లు.. ఈసారి కూడా దరఖాస్తు చేసుకోవాలని TSPSC ఆదేశించింది.

మరో రెండు హామీలను…

ఆరు గ్యారంటీల్లోని మరో రెండు హామీలను వారం రోజుల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ సిద్దమయ్యింది. దీని గురించి సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా ప్రకటించారు. వారం రోజుల్లోనే రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder), 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ (Free Current) అమలు చేస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు