Telangana Govt: కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి..! తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆయన్ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గానూ నియమించే అవకాశం కనిపిస్తోంది. By Shiva.K 08 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kodandaram: తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. గురువారం సీఎంగా రేవంత్ రెడ్డి సహా 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆవెంటనే.. అధికారుల నియామకాలపైనా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం. తొలి మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డిని నియమించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిని కూడా నియమించారు. అయితే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్‌కు ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలనలో ఆయన సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట.. ఈ నేపథ్యంలోనే ఆయనకు సలహాదారుడిగా నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పోస్టుకు కూడా కోదండరామ్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డికి, కోదండరామ్‌కు మధ్య ఎప్పిటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా.. ఎన్నికల వేళ కూడా కోదండరామ్‌తో రేవంత్ రెడ్డి లుమార్లు కలుస్తూ వచ్చారు. కాంగ్రెస్-టీజేఎస్ మధ్య పొత్తు కుదిర్చారు. ఆ ప్రయత్నాలన్నీ ఓకే అవగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పాటవడంతో కోదండరామ్ కీలక పాత్ర పోషించనున్నారు. కోదండరాం సానుకూలత.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత తెలంగాణ సచివాలయం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఉద్యోగుల సంబరాల్లో కోదండరామ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో కొత్త ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారదిగా ఉంటానని ప్రకటించారు. దీంతో ప్రభుత్వంలో ఆయనకు కీలక పదవి దక్కనుందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. కోదండరామ్ ఒక్కరే కాదు.. రేవంత్ రెడ్డి తన టీమ్‌లోకి మరికొందరు మేధావులను కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. Also Read: ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే గుండె ఆరోగ్యం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.. మహిళలకు గుడ్ న్యూస్.. ఈ నెల 9 నుంచే ఉచిత బస్సు ప్రయాణం #cm-revanth-reddy #telangana-politics #kodandaram #telangana-government #professor-kodandaram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి