BIG BREAKING: టెట్ నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. DSC కి ముందు టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

New Update
Lok Sabha Elections: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు రోజులు సెలవులు!

TET Exam: టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. DSC కి ముందు టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 3 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ది చేకూరనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి డీఎస్సీ కి ముందు టెట్ పరీక్ష నిర్వహించాలని టెట్ అభ్యర్థులు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పరీక్షలపై మంత్రి రాజనర్సింహ అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు భేటీ అయినా సబ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

ALSO READ: ఇవే నాకు చివరి ఎన్నికలు.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

11,062 పోస్టులతో మెగా డీఎస్సీ.. 

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నిన్న పాత నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), 2,629 స్కూల్ అసిస్టెంట్లు (SA), 727 లాంగ్వేజ్ పండిట్లు (LP), 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET), 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 220 పోస్టులు, 79 SA క్యాడర్ కింద ఖాళీలు ఉంటాయి. ఈ పోస్టులలో గత బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ అధికారులతో కలిసి నోటిఫికేషన్ జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ ఉద్యోగాలకు మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్ అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ లో 878 ఖాళీలు ఉండగా. నల్లగొండలో 605, నిజామాబాద్ 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 ఖాళీలను భర్తీ చేస్తారు. జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీలను పీడీఎఫ్ లో చూడవచ్చు.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

JOBS: ఎస్బీఐ పీవో ఫలితాల విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డీవోబీ, క్యాప్చా ఇచ్చి ఫలితాలను తెలుసుకోవచ్చును. 

New Update
SBI ATM Business ideas

SBI ATM Business ideas

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. గత నెల 8, 16, 24, 26 తేదీల్లో ఈ ఎగ్జామ్స్ జరిగాయి. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాల ఖాళీల భర్తీ చేయనుంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫలితాలు ఈ కింది వెబ్ సైట్ లో ఉంటాయి. 

https://sbi.co.in/web/careers/crpd/po-pre-2024-results

 

 today-latest-news-in-telugu | jobs

Also Read: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment