Teachers' Day 2024: వడ్డాణం శ్రీనివాస్ కు బెస్ట్ టీచర్ అవార్డు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వడ్డాణం శ్రీనివాస్ రావును తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. By Nikhil 05 Sep 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ వడ్డాణం శ్రీనివాస్ రావుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. శ్రీనివాస్ రావు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఇంకా ఈఎంఆర్ అండ్ ఆర్సీ విభాగానికి, సెంటర్ ఫర్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ విభాగానికి డైరెక్టర్ గా సైతం విధులు నిర్వర్తిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ రావు.. తన స్వగ్రామంలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం డిగ్రీ వరకు ఖమ్మంలో చదువుకున్నారు. ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 'తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రసార మాధ్యమాల పాత్ర' అనే అంశంపై శ్రీనివాస్ రావు పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందుకున్నారు. ఆయనకు హిస్టరీ, ఎడ్యుకేషన్, ఫిలాసఫీ తదిరత సబ్జెక్టుల్లో దాదాపు పాతికేళ్ల టీచింగ్ అనుభవం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 113 మందిని వివిధ విద్యాసంస్థల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో పాఠశాల విద్యాశాఖ నుంచి 47 మంది, ఇంటర్ ఎడ్యుకేషన్ నుంచి 11, యూనివర్సిటీల నుంచి 45 మంది ఉన్నారు. నేడు హైదరాబాద్ రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాసర్ రావు ఈ అవార్డును అందుకోనున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి