Pravalika Death: ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ హత్య అన్న రాహుల్ గాంధీ..

హైదరాబాద్ లో ప్రవళిక ఆత్మహత్య విషయంపై గవర్నర్ తమిళిసై సైతం స్పందించారు. ఈ కేసులో 48 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీ, టీఎస్పీఎస్సీ సెక్రెటరీలను గవర్నర్ ఆదేశించారు. ఇది ప్రభుత్వ హత్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

New Update
Pravalika: నిరుద్యోగ యువతి ఆత్మహత్య..పోటీ పరీక్షల వాయిదానే కారణమా?

Governor Seeks Report on Pravalika Death: నియామక పరీక్షలు వాయిదా పడడంతో హైదరాబాద్ లో ప్రవళిక అనే నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్యగా మాత్రమే చూడవద్దని.. నిరుద్యోగ యువత కలలు ఆశలను ప్రభుత్వం హత్య చేసినట్టు ఉందని ఆరోపించారు. త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రాబోతుందన్నారు. తమ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను నిలబెడుతుందని హామీ ఇచ్చారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కూడా నిర్వహిస్తామన్నారు రాహుల్. ఒక్క ఏడాది లో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసానిచ్చారు. ఇది మా గ్యారెంటీ అని స్పష్టం చేశారు రాహుల్.


ఇది కూడా చదవండి: Pravalika: నిరుద్యోగ యువతి ఆత్మహత్య..పోటీ పరీక్షల వాయిదానే కారణమా?

ప్రవళిక ఆత్మహత్య విషయంపై గవర్నర్ తమిళిసై సైతం స్పందించారు. ఈ కేసులో 48 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీ, టీఎస్పీఎస్సీ సెక్రెటరీలను గవర్నర్ ఆదేశించారు. నిరుద్యోగులు సహనం కోల్పోవద్దని గవర్నర్ తమిళిసై కోరారు.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సైతం ప్రవళిక ఆత్మహత్య విషయమై మాట్లాడుతూ.. బతుకమ్మ గురించి రంగురంగుల వీడియోలు పెట్టే.. కవితకు ప్రవళిక ఆత్మ ఘోష వినబడటం లేదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని బీజేపీ నేత బండి సంజయ్ కోరారు. బీజేపీ మీ వెంటే ఉందని భరోసానిచ్చారు. ప్రవళిక మరణం గుండెల్ని పిండేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు