Telangana: ముగ్గురు విద్యార్థులను పొట్టు పొట్టుగా కొట్టిన 15 విద్యార్థులు.. అదే కారణమట..! నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఘర్షణలో 15 స్టూడెంట్స్ కలిసి ముగ్గురు విద్యార్థులను చితక బాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడుతున్నారు. By Shiva.K 08 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Clashes Between Mobile Phone: నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఘర్షణలో 15 స్టూడెంట్స్ కలిసి ముగ్గురు విద్యార్థులను చితక బాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జెపి నగర్ గురుకుల కళాశాలలో శుక్రవారం రాత్రి సెల్ ఫోన్ దొంగిలించారనె నెపంతో ముగ్గురు విద్యార్థులను 15 మంది విద్యార్థులు చితకబాదారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు సెల్ ఫోన్ కాలేజీలో అనుమతి లేనప్పటికీ తీసుకువస్తున్నారు. ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపం వల్ల సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అధ్యాపకుల ప్రోత్సాహంతోనే సెల్ ఫోను వినియోగిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, కాలేజీకి తీసుకువచ్చిన సెల్ ఫోన్ కనిపించకపోవడంతో ఉదయం మంత్రించిన బియ్యం(ప్రజల విశ్వాసం)ను విద్యార్థులందరికీ తినిపించారు. దారితప్పిన విద్యార్థులు.. అయినప్పటికీ ఫోన్ దొరకపోవడంతో తన తోటి ముగ్గురు విద్యార్థులైన నవీన్, సిద్ధార్థ్, జయంత్ పై అనుమానంతో రాత్రి పది గంటల తర్వాత గ్రౌండ్ లోకి తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ విషయాన్ని బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ శనివారం ఉదయమే తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దాంతో తల్లిదండ్రులు వచ్చేసరికి కళాశాల సిబ్బంది వాచ్ మెన్ ఎవరూ లేరు. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ ఘటనపై సంబంధిత ఆర్‌సిఓకి సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తామని చెప్పారు. దాంతో ఆర్‌సిఓ కాలేజీకి వచ్చి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. అయితే, ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విద్యకు మారుపేరైన గురుకులాలు గతి తప్పుతున్నాయని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కళాశాల సిబ్బంది ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ పిల్లల జీవితాలను గాలికి వదిలేశారని మండిపడుతున్నారు. విద్యార్థులు మూఢనమ్మకాలతో పాటు విచక్షణ కోల్పోయి దాడులు చేసుకునే స్థాయికి వచ్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నత అధికారులు పర్యవేక్షించి గురుకులాలలో చక్కబెట్టవలసిన అవసరం ఉంది. Also Read: TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు.. అసలు ఏం అయిదంటే..? #telangana-news #telangana #students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి