Telangana: మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల! అమిత్ షా గ్రీన్ సిగ్నల్..!

మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ నేతల ఈటల రాజేందర్ లైన్ క్లియర్ అయ్యింది. ఈటల వైపే అమిత్ షా మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మురళీధరరావు కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావించినా.. ఈటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

New Update
Telangana: మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల! అమిత్ షా గ్రీన్ సిగ్నల్..!

Etela Rajender MP Elections: తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాభం చవి చూసిన బీజేపీ.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో కనీసం 10 సీట్లు గెలుపొందాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీటు నుంచి 8 సీట్లకు పెరిగామని.. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 సీట్లు గెలవాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సానుకూలత ఉంటుందని బావిస్తోంది. అందుకే.. ఇప్పటి నుంచి ఎన్నికలకు సంబంధించి వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తోంది బీజేపీ అధిష్టానం. ఏకంగా పార్టీ అగ్రనేత అమిత్ షా రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా బాధత్యలు చేపట్టారు. గురువారం నాడు హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఈటలకు ఎంపీ టికెట్ కన్ఫామ్..

అయితే, తెలంగాణలో ఎంపీ టికెట్ల కోసం బీజేపీలో పోటీ గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలోనే.. పార్టీలోని ఇద్దరు ముగ్గురు నేతలు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మురళీధరరావు, ఈటల రాజేందర్ ఇద్దరూ మల్కాజిగిరి నుంచి పోటీకి ఆసక్తి చూపారు. అయితే, ఈటల రాజేందర్ వైపే అమిత్ షా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసేందుకు ఈటల రాజేందర్‌కు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ ఇద్దరిలో ఈటల అయితేనే బెటర్ అని అమిత్ షా భావించారట. దీంతో ఈటల పోటీకి లైన్ క్లియర్ అయ్యింది.

Also Read:

ఒక్క క్లిక్‌తో అభయహస్తం అప్లికేషన్ ఫామ్.. మీ మొబైల్‌లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

పట్టణంలో ఉండి కూడా ప్రభుత్వ పథకాలకు అప్లే చేసుకోవచ్చు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు