KTR: ధరణిలో లోపాలు.. కామారెడ్డిలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. తెలంగాణలో 24 గంటలు లేదన్న రేవంత్... కరెంట్ తీగలు పట్టుకొని చూడాలని కేటీఆర్ చురకలు అంటించారు. విద్యుత్ కష్టాలు తీర్చాం కాబట్టే వరి పంటలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.

New Update
KTR: ధరణిలో లోపాలు.. కామారెడ్డిలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

Telangana Elections 2023: జిల్లాల పర్యటనలతో బిజీగా గడుపుతన్నారు మంత్రి కేటీఆర్. ప్రచారంలో భాగంగా ఇవాళ కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ఒక్కడిని ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు.

ALSO READ: ప్రచారంలో స్పృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత

కామారెడ్డిలో రోడ్‌ షో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు.. నియోజక వర్గంలో విద్యుత్ తీగలు పట్టుకుంటే తెలుస్తుంది కరెంట్ ఉందో లేదో.. విద్యుత్ కష్టాలు తీర్చాం అందుకే వరి సాగు పెరిగింది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం.. కేసీఆర్ కామారెడ్డి నుండి గెలిచి హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు. వచ్చే ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.. రాహుల్ గాంధీకి, మోడీకి తెలంగాణపై ప్రేమ లేదు.. కేసీఆర్‌ ని కామారెడ్డిలో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా' అని అన్నారు.

ALSO READ: అతని వల్లే సంజయ్‌ను తొలగించారు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తాం కేటీఆర్‌ పేర్కొన్నారు. రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వాళ్లందరికీ సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. ధరణిలో ఉన్న చిన్నచిన్న లోపాలు సరిచేస్తామని పరోక్షంగా కేటీఆర్ ధరణిలో లోపాలు ఉన్నాయని ఒప్పుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు